భారీ సినిమాలు బరిలో వున్నప్పుడే శర్వానంద్ సినిమాలు వెనక్కు తగ్గలేదు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి చిత్రాలు భారీ పోటీ నడుమ విడుదలయి విజయవంతమయ్యాయి. పెద్ద సినిమాలతో పోటీ పడడం, విజయం సాధించడం అతడికి కొత్త కాదు. కానీ ‘శ్రీకారం’ చిత్రానికి శర్వానంద్ లెక్క తప్పింది. చాలా సినిమాలు బరిలో వున్నాయని తన సినిమా వాయిదా వేసుకున్నాడు. అయితే ఈసారి సమ్మర్ రేసులో వున్నవన్నీ మాస్ సినిమాలే. శ్రీకారం వచ్చినట్టయితే కచ్చితంగా వెరైటీ సినిమా అయి వుండేది. కానీ ఈసారి శర్వానంద్ సినిమాకు సరయిన ప్లానింగ్ చేయడానికి వెనుక దిల్ రాజు, యువి క్రియేషన్స్ నిర్మాతలు లేరు.
దాంతో శ్రీకారం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. శర్వానంద్ గత మూడు చిత్రాలు ఫ్లాప్ అవడం కూడా ధైర్యం చేయలేకపోవడానికి కారణం అయి వుండొచ్చు. శ్రీకారం సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై ఇంకా నిర్మాతలు నిర్ణయానికి రాలేదు. ఫిబ్రవరిలో వసూళ్లు పెద్దగా వుండవు కనుక వేసవిలో విడుదల చేయాలని శర్వానంద్ కోరుతున్నాడట. అయితే అప్పుడు కూడా సంక్రాంతికి మించిన పోటీ బాక్సాఫీస్ వద్ద వుండడం ఖాయమనేది ట్రేడ్ వర్గాల మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates