Movie News

త్రివిక్రముడికి అదే అతి పెద్ద సవాల్

తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనలా తెలుగుదనంతో, కుటుంబ అంశాలతో సినిమాలు తీసే అలాంటి దర్శకులు అరుదు. బహుశా దీని వల్లే ఆయన తెలుగుకే పరిమితం అయిపోయారని చెప్పొచ్చు. మిగతా పెద్ద దర్శకుల్లా త్రివిక్రమ్ పాన్ ఇండియా స్థాయికి ఎదగలేకపోయారు. ఇప్పటిదాకా పాన్ ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా చేయలేదు త్రివిక్రమ్. ఎన్టీఆర్‌తో రూపొందించబోయే సుబ్రహ్మణ్యస్వామి ప్రాజెక్టుతో తొలిసారిగా ఆ ప్రయత్నమే చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

తెలుగులోనే కాదు.. మొత్తంగా ఇండియన్ సినిమాలో దాదాపుగా కనుమరుగైపోయిన మైథాలజీ జానర్‌ను టచ్ చేస్తోంది త్రివిక్రమ్, ఎన్టీఆర్ జోడీ. ఈ ప్రాజెక్టు కోసం భారీ బడ్జెట్టే పెట్టబోతున్నారు. టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో మాగ్నమ్ ఓపస్‌గా ఈ చిత్రాన్ని చెప్పొచ్చు.

ఐతే తెలుగులో మైథాలజీ సినిమాలు కనుమరుగైపోవడానికి కారణం.. ఆ కథలను డీల్ చేయగల రైటర్లు, డైరెక్టర్లు లేకపోవడమే. కానీ రచయితగా త్రివిక్రమ్ సామర్థ్యం మీద ఎవరికీ సందేహాలు లేవు. ఆయన విద్వత్తు గురించి అందరికీ తెలిసిందే కాబట్టి.. స్టోరీ, డైలాగ్స్ విషయంలో ఏ లోపమూ ఉండకపోవచ్చు. ఆ కాలానికి తగ్గ గ్రాంథిక సంభాషణల విషయంలోనూ ఎవ్వరూ వేలెత్తి చూపడానికి వీల్లేకుండా త్రివిక్రమ్ తన పెన్ పవర్ చూపిస్తాడనడంలో సందేహం లేదు.

కానీ టేకింగ్ దగ్గరే కొంత అనుమానాలున్నాయి. ఇప్పటిదాకా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ఈవెంట్ ఫిలిమ్స్‌ ఏవీ త్రివిక్రమ్ చేయలేదు. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి యువ దర్శకులు ఇందులో గొప్ప నైపుణ్యం చూపించి చాలా త్వరగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయారు కానీ.. ఇప్పటిదాకా త్రివిక్రమ్ మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు.

ఇప్పటిదాకా తీసిన చిత్రాల్లో ఒకట్రెండు సన్నివేశాలతో శాంపిల్ కూడా చూపించలేదు త్రివిక్రమ్. అలాంటి దర్శకుడు ఇప్పుడు నేరుగా ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమా చేయబోతున్నాడు. ఇందులో యుద్ధాలకు తోడు భారీతనంతో కూడుకున్న సన్నివేశాలు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన రైటింగ్‌తో ఎంత నైపుణ్యం చూపించినా.. ఎఫెక్ట్స్, భారీతనంతో కూడుకున్న సన్నివేశాల్లో త్రివిక్రమ్ ఎలాంటి ఔట్ పుట్ తీసుకొస్తాడన్నదే అతి పెద్ద సవాల్. ఆ సవాల్‌ను ఛేదించగలిగితే.. పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ పేరు మార్మోగిపోవడం ఖాయం.

This post was last modified on July 1, 2026 11:44 am

Share

Recent Posts

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

1 hour ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

2 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

3 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

4 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

4 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

5 hours ago