Movie News

శ్రీనిధి శెట్టికి తత్వం బోధపడిందా

కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ లో హీరోయిన్ కావడంతోనే శ్రీనిధి శెట్టి దశ తిరిగిందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. చాలా తక్కువ సినిమాలు చేయడం, అవేవి కెజిఎఫ్ స్థాయి కాదు కదా కనీసం సగం కూడా అందుకోలేకపోవడం కెరీర్ మీద ప్రభావం చూపించాయి. విక్రమ్ కోబ్రా దారుణంగా పోయింది. హిట్ 3 ది థర్డ్ కేస్ ఓ మోస్తరుగా ఆడింది కానీ క్రెడిట్ అధిక శాతం నాని, దర్శకుడు శైలేష్ కొలను పంచుకున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా ఎంత ఫ్లాపో తెలిసిందే.

సరే ఇక్కడిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే సీనియర్ మోస్ట్ హీరో వెంకటేష్ పక్కన శ్రీనిధి శెట్టి భార్యగా నటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జోడిగా ఓకే కానీ టీనేజ్ పిల్ల తల్లిగా ఈ పాత్రకు ఒప్పుకోవడం ఉన్న కాసిన్ని అభిమానులకు షాకే. ఇంకో పిల్లాడు కూడా ఉన్నాడు. దృశ్యంలో మీనా చేయడం అంటే ఆవిడ వయసులోనూ వెంకీకి సమఉజ్జి కాబట్టి ఏదో అనుకోవచ్చు. కానీ శ్రీనిధి శెట్టి, వెంకటేష్ కు మధ్య వయసు వ్యత్యాసం సుమారు మూడు దశాబ్దాలు ఉంటుంది. సమస్య ఇది కాదు.

ఇంత తక్కువ కెరీర్ లో శ్రీనిధి శెట్టి పిల్లల తల్లిగా షిఫ్ట్ అయిపోవడం చూస్తుంటే బాక్సాఫీస్ తత్వం అర్థం చేసుకున్నట్టే కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడం ముందు మిగిలిన అంశాలను పట్టించుకోనవసరం లేదనే తరహాలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. పైకి ఆదర్శ కుటుంబం అంటున్నారు కానీ అసలు సినిమాలో బోలెడు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయట. అక్కడ శ్రీనిధికి స్కోప్ ఉంటుందని అంటున్నారు.

ఇదంతా పక్కనపెడితే శ్రీనిధి శెట్టికి డెబ్యూ రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కినా దాన్ని చక్కగా మలచుకోలేకపోవడం బ్యాడ్ లక్కే. అయినా ఎక్కువ అవకాశాలు ఒడిసిపట్టుకుంటే హిట్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే తప్ప మరీ సెలెక్టివ్ గా ఉంటే ఈ సమస్య వస్తుంది. వెంకటేష్ పక్కన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లాంటి వాళ్ళు బాగానే సెట్ అయ్యారు కాబట్టి లుక్స్ పరంగా శ్రీనిధిశెట్టికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకు త్రివిక్రమ్ ఆవిడ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసారో చూడాలి.

This post was last modified on June 28, 2026 4:31 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago