దక్షిణాది సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అభిమానులను శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా గొప్ప ప్రతిభను చాటిన భాగ్యరాజ్.. నిన్న గుండెపోటుతో మరణించడం దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు అభిమానులకూ ఎంతో బాధ కలిగించింది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన గొప్పదనం తెలియకపోవచ్చు కానీ.. 80, 90 దశకాల్లో గొప్ప కథా బలం ఉన్న చిత్రాలతో ఆయన సౌత్ ఇండస్ట్రీపై బలమైన ముద్ర వేశారు.
సుందరకాండ, అబ్బాయిగారు సహా పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాలు తమిళంలో ఆయన సినిమాల ఆధారంగా తెరకెక్కినవే. విశేషం ఏంటంటే.. ఈ రెండు రీమేక్ అయినా సరే.. భాగ్యరాజ్ నటించిన ఒరిజినల్స్ తెలుగులో డబ్ అయి విజయాన్నందుకున్నాయి. ఆయన నటించిన మరెన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయిన భాగ్యరాజ్ చిత్రాల జాబితా పెద్దదే.
ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ఆయన ఒక తెలుగు సినిమాకు తమిళంలో ఆయన మాటలు రాశారు. ఆయన స్థాయికి ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవి కోసమే ఆ పని చేశారు. ఆయన మాటలు రాసిన డబ్బింగ్ మూవీ ‘మగధీర’ కావడం గమనార్హం. తెలుగులో ఆ సమయానికి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మగధీర’ను కొన్ని రోజుల తర్వాత ‘మావీరన్’ పేరుతో తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు.
ఆ సినిమాకు తమిళంలోనూ మంచి రీచ్ తీసుకొచ్చి చరణ్‌కు ఫాలోయింగ్ పెంచాలనే ఉద్దేశంతో చిరు.. రైటర్‌గా లెజెండరీ స్టేటస్ ఉన్న భాగ్యరాజ్‌ను మాటలు రాయమని అడిగారు.
సుదీర్ఘ కెరీర్లో ఎన్నడూ భాగ్యరాజ్ ఒక డబ్బింగ్ సినిమాకు మాటలు రాసింది లేదు. కానీ చిరు కోసం ఆ పని చేశారు. ‘మావీరన్’ తమిళంలో మంచి స్పందనే తెచ్చుకుంది. డబ్బింగ్ ఫిలిం అనే భావన రాకుండా భాగ్యరాజ్ చక్కగా మాటలు రాసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవల ఖుష్బూ కూతురి పెళ్లికి వెళ్లిన చిరు.. భాగ్యరాజ్‌తో సరదాగా గడిపారు. కానీ ఒక్క రోజు విరామంలో భాగ్యరాజ్ మరణ వార్త బయటికి రావడంతో చిరు తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates