దేశంలో మరెక్కడా లేని విధంగా తమిళనాడులో మాత్రం థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దీని పట్ల కోలీవుడ్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సహా వేరే ఇండస్ట్రీల వాళ్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సినీ పరిశ్రమకు ఇది గొప్ప ఊతాన్నిచ్చేదిగా పేర్కొంటున్నారు. తమ దగ్గరా ఇలాగే 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపేందుకు అనుమతులిస్తే బాగుంటందని చూస్తున్నారు.
ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలూ జరిగే అవకాశముంది. ఐతే తమిళ సినీ పరిశ్రమలో అందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని పొగిడేస్తుంటే.. ఒక నటుడు మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్య చేసి వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఆ నటుడే.. అరవింద్ స్వామి.
‘‘కొన్ని సందర్భాల్లో 100 శాతం కంటే 50 శాతమే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. ఇది అలాంటి సమయమే’’ అని అరవింద్ స్వామి ట్విట్టర్లో వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాట థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే అరవింద్ ఈ ట్వీట్ చేశాడు. ఇది చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. ఓ వైపు ఇండస్ట్రీ ప్రముఖులందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పొగుడూ ట్వీట్లు వేస్తున్న సమయంలో అరవింద్ ఇలాంటి ట్వీట్ వేయడమేంటి అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు.
ఐతే కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చి.. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని విడుదల చేస్తే.. పూర్వపు రోజుల్లో మాదిరి థియేటర్లన్నీ కిక్కిరిసిపోయి వైరస్ ప్రభావం కచ్చితంగా పెరుగుతుందనే ఆందోళన నేపథ్యంలోనే అరవింద్ ఈ ట్వీట్ వేశాడని అర్థమవుతోంది. అందుకే అతను ధైర్యంగా ఇలాంటి ట్వీట్ పెట్టడాన్ని సమర్థిస్తున్న వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
This post was last modified on January 5, 2021 1:40 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…