తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద ఆధారపడుతుంటారు. పెద్ద హీరోలు నటించే భారీ బడ్జెట్ చిత్రాలంటే కచ్చితంగా వేరే భాషకు చెందిన సినిమాటోగ్రాఫర్ ఉండాల్సిందే. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి ఛాయాగ్రాహకులను అరువు తెచ్చుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే.
రవివర్మన్, రవి.కె.చంద్రన్, రత్నవేలు, తిరు.. ఇలా ఎందరో లెజెండరీ సినిమాటోగ్రాఫర్లు తమిళం నుంచే వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. తెలుగు సినిమాటోగ్రాఫర్లను తెలుగులో చిన్న సినిమాలకే పెట్టుకుంటూ ఉంటారు. వేరే భాషల్లో మన వాళ్లకు అవకాశాలు దక్కడం అరుదు. అలాంటిది ఇప్పుడో భారీ తమిళ చిత్రానికి తెలుగు సినిమాటోగ్రాఫర్ పని చేయబోతున్నాడు. ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కాగా.. దానికి పని చేయబోతున్న తెలుగు సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన నికేత్.. నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’తో ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, యుటర్న్, అంటే సుందరానికి, 35-చిన్న కథ కాదు లాంటి తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు. తమిళంలో అతడికి సూర్య లాంటి పెద్ద హీరోతో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుని అద్భుతమైన విజువల్స్ అందించాడు. తర్వాత డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతోనూ ప్రతిభను చాటుకున్నాడు.
‘డ్రాగన్’ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తునే ఇప్పుడ రజినీ సినిమా ‘ధర్మన్’కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమా కదా అని పెద్ద సినిమాటోగ్రార్ల కోసం చూడకుండా నికేత్ టాలెంటును నమ్మి ఈ మెగా మూవీలో అతడికి ఛాన్సిచ్చాడు అశ్వత్. కమల్ నిర్మాణంలో రజినీ నటించే సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో, దాని రీచ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోనూ తన టాలెంట్ చూపించాడంటే నికేత్ టాప్ సినిమాటోగ్రాఫర్ల లీగ్‌లోకి వెళ్లిపోవడం ఖాయం.
This post was last modified on June 26, 2026 6:35 pm
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…