నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ సిరీస్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నాలుగు ఎపిసోడ్ల సిరీస్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక బలమైన ఆయుధంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కు వచ్చిన ఇమేజ్ కేవలం రాజమౌళి వల్ల వచ్చిన లాటరీ అంటూ ఇన్నాళ్లూ ట్రోల్ చేసిన వారికి ఈ సిరీస్ లోని విజువల్స్ తో అభిమానులు గట్టిగా బదులిస్తున్నారు.
ఒక హీరో తన కెరీర్ లో అత్యంత కీలకమైన ఐదేళ్ల సమయాన్ని ఒకే ప్రాజెక్ట్ కోసం కేటాయించడం మామూలు విషయం కాదు. లాటరీ తగలడానికి ఐదేళ్ల కష్టం అవసరం లేదని ఫ్యాన్స్ లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు. సినిమా హిట్ అవుతుందో లేదో తెలియని ఆ రోజుల్లోనే ఇతర సినిమాల కమిట్మెంట్స్ అన్నీ పక్కనపెట్టి ప్రభాస్ తీసుకున్న రిస్క్ ఈ డాక్యుమెంటరీలో కనిపించింది.
అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల కోసం ప్రభాస్ పడిన ఫిజికల్ స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. భారీగా బరువు పెరగడం తగ్గడం లాంటి ప్రయోగాల వల్ల భుజం, మోకాలికి సర్జరీలు కూడా జరిగాయి. దీనికి తోడు ఏళ్ల పాటు రెమ్యునరేషన్ తీసుకోకపోవడం, లుక్ రివీల్ కాకూడదని కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్మెంట్లను వదులుకోవడం లాంటి ఆర్థికపరమైన త్యాగాలను నెటిజన్లు ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. కేవలం తన స్టార్ డమ్ తో వరల్డ్ వైడ్ గా తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు లెక్కలతో చెబుతున్నారు. దీన్ని బట్టి అతని సక్సెస్ వెనుక ఉన్నది అదృష్టం కాదు, ఏళ్లుగా పడిన కష్టం అని ఫ్యాన్స్ బలంగా వాదిస్తున్నారు.
ఇక డాక్యుమెంటరీ ముగింపులో ఇచ్చిన ఒక చిన్న హింట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రానా, ప్రభాస్ తమ మూడు వేళ్లతో చూపించిన సైన్ బాహుబలి 3కి సంకేతం అని అర్ధమవుతుంది. దీంతో ట్రోలర్స్ కు చెక్ పెడుతూనే ఫ్రాంచైజీ నెక్స్ట్ పార్ట్ పై సోషల్ మీడియాలో సరికొత్త వైబ్ క్రియేట్ అయింది.
This post was last modified on June 27, 2026 11:17 am
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…
మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…