వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు సినిమా విడుదల ఇంకా ఏడాది ఉండగానే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాయి. ఛాన్స్ దొరికితే చాలు ఈ మూవీ గురించి చెప్పే అవకాశాన్ని పృథ్విరాజ్ వదులుకోవడం లేదు. ఇందులో మెయిన్ విలన్ కుంభగా చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఎగ్జైట్ మెంట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
తాజాగా పృథ్విరాజ్ సుకుమారన్ ఒక విశేషం పంచుకున్నారు. అదేంటంటే ఉదయం నుంచి రాత్రి దాకా కేవలం ఒక షాట్ కోసం తొంభై దాకా టేకులు తీసుకుని అది సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ రోజుకి షూటింగ్ ప్యాకప్ చెప్పేశారట. అది మహేష్ బాబు మీద నడిచే సీన్. బాగా వస్తున్నప్పటికీ తాను కోరుకున్న పర్ఫెక్షన్ వచ్చేదాకా జక్కన్న ఎంతగా ఆర్టిస్టులను సతాయిస్తారో ఆర్ఆర్ఆర్ టైంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటాలను గుర్తు చేసుకోవచ్చు. అంత పని రాక్షసుడు ఆయన.
బడ్జెట్, స్కేల్ పరంగా ఎవరూ ఊహించనంత గొప్పగా వారణాసి ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్న పృథ్విరాజ్ సుకుమారన్ రాజమౌళి పనితనానికి మంత్రముగ్దుడు అయిపోయాడు. నిర్మాణ సంస్థ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ రాకపోయినా ఇలా ఏదో ఒక రూపంలో వారణాసి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదల ఫిక్స్ చేసుకోవడంతో దానికి అనుగుణంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో రాజమౌళి చాలా బిజీగా ఉన్నారు.
థియేటర్ బిజినెస్ పరంగా వారణాసి ఎంత నెంబర్ నమోదు చేస్తుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ నాటికి ఏపీ తెలంగాణ మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం వారణాసి ఫీవర్ లో ఊగిపోయేలా ఉంది. ఇంకా హక్కుల అమ్మకాలు మొదలుకాలేదు. చాలా సమయం ఉంది కాబట్టి నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ తొందరపడే ఉద్దేశంలో లేరు. మహేష్ బాబు అభిమానులు సంవత్సరం ఎప్పుడెప్పుడు గడిచిపోతుందాని వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on June 25, 2026 10:56 am
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…