Movie News

ర‌జినీ సినిమాలో రాశి… ఏం చేస్తుంద‌బ్బా?

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగులో రాశి ఖ‌న్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియ‌ర్ ఎన్టీఆర్ సహా ప‌లువురు స్టార్ హీరోల‌తో ఆమె సినిమాలు చేసింది. తొలిప్రేమ చిత్రంతో న‌టిగానే మంచి గుర్తింపు సంపాదించింది. కానీ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ఆమెను వెన‌క్కి లాగేశాయి. అందం, అభిన‌యం రెండూ ఉన్న ఈ అమ్మాయికి అవ‌కాశాలు క్ర‌మంగా త‌గ్గిపోయాయి.

కానీ అదే టైంలో వేరే భాష‌ల్లో అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేస్తూ ఎప్పుడో ఒక‌సారి తెలుగులోనూ న‌టిస్తూ వ‌స్తోంది రాశి. గ‌త ఏడాది తెలుసు క‌దా మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూసింది కానీ.. అది ఆమెకు నిరాశ‌నే మిగిల్చింది. ఈ ఏడాది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీతోనూ ఆమెకు షాక్ త‌గిలింది. ఇలా కెరీర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేని టైంలో రాశికి ఒక క్రేజీ మూవీలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఈసారి ఆమె సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మూవీలో మెర‌వ‌బోతోంది.

ర‌జినీ హీరోగా అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ధ‌ర్మ‌న్ సినిమాను బుధ‌వార‌మే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను కూడా లాంచ్ చేసిన చిత్ర బృందం… ప్రెస్ మీట్ పెట్టి కాస్ట్ అండ్ క్రూను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో రాశితో పాటు సీనియ‌ర్ న‌టి సిమ్రన్ కూడా న‌టిస్తోంది.

సిమ్ర‌న్ ఉందంటే.. ర‌జినీకి జోడీగా ఆమెనే న‌టిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గా.. ఎంద‌రో స్టార్ల‌తో న‌టించినా ర‌జినీకి మాత్రం జోడీగా న‌టించ‌ని సిమ్ర‌న్.. లేటు వ‌య‌సులో పేట మూవీలో ఆయ‌న స‌ర‌స‌న క‌నిపించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సూప‌ర్ స్టార్‌తో జోడీ క‌డుతోంది.

మ‌రి ఈ సినిమాలో రాశి ఖ‌న్నా ఎలాంటి క్యారెక్ట‌ర్ చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. వ‌య‌సు తేడా దృష్ట్యా ర‌జినీకి రాశి జోడీగా న‌టించే అవ‌కాశం ఎంత‌మాత్రం లేదు. బ‌హుశా కూతురిగా లేదంటే ఇంకేదైనా ముఖ్య పాత్ర‌లో ఆమె క‌నిపించే అవ‌కాశ‌ముంది. ర‌జినీ ఇందులో డాక్ట‌ర్ పాత్ర చేయ‌నున్నాడు. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే జూనియ‌ర్ డాక్ట‌ర్‌గా కూడా ఆమె క‌నిపించొచ్చు.

హీరోయిన్ కాదు కాబ‌ట్టి.. రాశికి న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న కీల‌క పాత్రే ద‌క్కి ఉంటుంద‌ని ఆశించ‌వ‌చ్చు. అశ్వ‌త్ మారిముత్తు సినిమాల‌ను ప‌రిశీలిస్తే లేడీ క్యారెక్ట‌ర్ల‌కు ప్రాధాన్యం ఉంటుంది. కాబ‌ట్టి రాశికిది సూప‌ర్ ఛాన్స్ అనొచ్చ‌. కెరీర్లో ఈ ద‌శ‌లో ర‌జినీ మూవీలో స‌రైన పాత్ర ప‌డితే.. రాశి కెరీర్ మ‌ళ్లీ మ‌లుపు తిరిగే అవ‌కాశ‌ముంది.

This post was last modified on June 25, 2026 4:15 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago