కలిసొస్తే కాలమొస్తే బ్లాక్‍బస్టర్ నడిచి వస్తుందని… అల్లు అర్జున్ ఇప్పుడు ఏది ప్లాన్ చేసినా బంగారమే అవుతోంది. అల వైకుంఠపురములో చిత్రం కరోనా రాకముందే రిలీజ్ అయిపోయి బ్రహ్మాండమయిన విజయం సాధించింది. అల్లు అర్జున్‍ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సినిమా రిలీజ్ టైమింగ్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు హిట్టవుతున్నాయి కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ లాంటి సూపర్‍స్టార్ల కాంబినేషన్ నుంచి రావడంతో ఆ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఇదిలావుంటే కరోనా లాక్‍డౌన్ తర్వాత సినిమాల ట్రెండు మారిపోయింది. ఈ టైమ్‍లో సినీ ప్రియులు ఎన్నెన్నో విదేశీ చిత్రాలను, పరభాషా సినిమాలను చూసేసారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు, వైవిధ్యం అని కూడా అర్థం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వచ్చే సినిమాలనుంచి అదే ఆశిస్తున్నారు. ఈ ట్రెండుకి తగ్గ సినిమా పుష్ప. అల్లు అర్జున్‍కి లక్కీగా ఈ సినిమా లాక్‍డౌన్‍కి ముందే సెట్ అయింది. కానీ లాక్‍డౌన్ తర్వాత రానున్న భారీ సినిమాలలో ఇదొక్కటే ఇప్పటి ట్రెండుకి తగ్గ సినిమా అనిపిస్తోంది. ఇది కానీ క్లిక్ అయితే ట్రెండు కూడా కలిసొచ్చి బన్నీకి మరో రీసౌండింగ్ బ్లాక్‍బస్టర్ ఖాయమవుతుంది.
This post was last modified on January 4, 2021 11:34 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…