Movie News

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా దారుణంగా డిజాస్టర్ అవుతోంది. గత వారం ఆమె నటించిన భారత భాగ్య విధాత విడుదలైన సంగతి తెలిసిందే. ముంబై నగరాన్ని వణికించిన 2008 టెర్రరిస్టుల దాడుల్లో ఒక ఆసుపత్రి సిబ్బంది చూపించిన ధైర్య సాహసాలు, సేవలను హైలైట్ చేసే ఉద్దేశంతో దర్శకుడు మనోజ్ తపాడియా దీన్ని తెరకెక్కించారు కానీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

ఫలితంగా రెండో వారంలో అడుగు పెట్టే నాటికి భారత భాగ్య విధాత నెట్ వసూళ్లు కేవలం అయిదున్నర కోట్లే రావడం ట్రేడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే సినిమాకు అయిన బడ్జెట్ యాభై కోట్ల పైమాట. దాంట్లో కనీసం పది శాతం కూడా రికవరీ కాలేదంటే అంతకన్నా ట్రాజెడీ మరొకటి ఉండదు. ట్విస్ట్ ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో దీనికి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా టికెట్ రేట్లు తగ్గాయి. అయినా సరే జనం టికెట్లు కొనడం లేదు.

కంగనా ఇంతకు ముందు సినిమా ఎమర్జెన్సీ కూడా ఇదే తరహాలో సూపర్ డూపర్ ఫ్లాప్ అందుకుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే కంగనా పాపం కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నా రిజల్ట్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ప్రమోషన్లు చేసి, ప్రీమియర్ షోలు వేసి ఎంత హడావిడి చేసినా సరే ఫలితం మారడం లేదు. నిజానికి భారత భాగ్య విధాత మరీ బ్యాడ్ మూవీ కాదు. కాకపోతే ఈ కాన్సెప్ట్ పట్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేదంతే.

ఒక విషయం గమనిస్తే ఇలాంటి కాన్సెప్టులు వెబ్ సిరీస్ లకు బాగుంటాయి. ఆడియన్స్ కూడా వాటికే అలవాటు పడ్డారు. ఇదే 2008 దాడుల మీద ఎంతో వెబ్ కంటెంట్ ఎన్నో ఓటిటిల్లో వచ్చింది. అలాంటిది మళ్ళీ దాన్నే తీసుకుని సినిమాగా తీస్తే డబ్బులు ఇచ్చి ఎవరు చూస్తారు. కంగనా రౌనత్ పొరపడింది ఇక్కడే. పోనీ డిజిటల్ లో చూస్తున్నారా అంటే అదీ లేదు. ఓటిటిలో వచ్చినప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నారు. దెబ్బకు క్వీన్ 2 కూడా వాయిదా పడేలా ఉంది.

This post was last modified on June 19, 2026 9:34 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago