అఖిల్ అక్కినేని పెద్ద స్టార్ అయిపోతాడని అనుకుంటే ఇప్పుడు కనీసం ఒక్క హిట్ పడితే చాలన్నట్టుగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో అఖిల్ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు కానీ సడన్‍గా ఆ ఆలోచన విరమించుకున్నారు. దానికి కారణం సెకండ్ హాఫ్‍పై వున్న డౌట్లేనని తెలిసింది.
జీఏ2 పిక్చర్స్ సినిమాల షూటింగ్ ఎంత త్వరగా పూర్తయినా కానీ ఎడిటింగ్‍లో బాగా టైమ్ తీసుకుంటారు. ఎలాగయినా దానిని ప్రేక్షక జన రంజకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అవసరమయితే మరికొన్ని రోజుల షూటింగ్ చేస్తారు. లేదా తీసిన సీన్లనే మళ్లీ రీషూట్ చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాచ్‍లర్‍కి అవే మెరుగులు దిద్దుతున్నారట. అందుకే సంక్రాంతి రిలీజ్ వద్దనుకున్నారట. అలాగే జనవరి 31 వరకు సినిమా థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతాయి కనుక ఫిబ్రవరి నుంచి ఆ నిబంధనలు ఎత్తి వేస్తారని ఆశిస్తున్నారు. అందుకే సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తే బెస్ట్ అని అనుకుంటున్నారు.
This post was last modified on January 4, 2021 11:37 am
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…