మొన్న ఏడాది దీపావళి పండక్కు విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమా అమరన్ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. క, లక్కీ భాస్కర్ పోటీని తట్టుకుని హిట్టు కొట్టడం చిన్న విషయం కాదు. కాకపోతే తన చిత్రాల రిలీజుల విషయంలో నిర్మాతలు పాటిస్తున్న ధోరణి టాలీవుడ్ ప్రేక్షకులను దూరం చేసేలా ఉందని అభిమానులు వాపోతున్నారు. ఎందుకంటే నాని తరహాలో ప్యాన్ ఇండియా హీరోగా సెటిలయ్యేందుకు అతను పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు
మ్యాటర్ ఏంటంటే కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న సెయోన్ ని తొలుత ఈ దీపావళికి రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే రామాయణ ఉండటంతో బయట రాష్ట్రాల్లో ఇబ్బంది అవుతుందని భావించి ఇప్పుడు దాన్ని 2027 సంక్రాంతి రేసులో దింపే ఆలోచన చేస్తున్నారట. అదే జరిగితే ఏపీ తెలంగాణలో థియేటర్లు దొరకడం కష్టం. ఎందుకంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, శర్వానంద్ లాంటి స్టార్ల సినిమాలు ఆల్రెడీ కర్చీఫ్ వేసుకునే పనిలో ఉన్నాయి.
ఈ సమస్య శివ కార్తికేయన్ కు మొదటిసారి రాలేదు. ఈ ఏడాది పొంగల్ కు పరాశక్తి తమిళనాడులో రిలీజయ్యింది. కానీ ఇక్కడ చేయలేదు. కారణం థియేటర్ల కొరత. అది ఫ్లాప్ కావడం వేరే సంగతి. సమాంతరంగా రిలీజ్ చేసి ఉంటె మినిమం ఓపెనింగ్స్ దక్కి కాసిన్ని డబ్బులు వచ్చి ఉండేవనేది అభిమానుల వర్షన్. తెలుగు జనాలు ఓటిటిలో చూడటం చూడకపోవడం అనవసరం. అంతకు ముందు అయలన్ కూడా అచ్చం ఇదే తరహాలో పోటీ వల్ల థియేటర్లకు రాలేదు.
ఇలా రిపీట్ అవుతూ ఉంటే శివకార్తికేయన్ కు మన మార్కెట్ క్రమంగా తగ్గిపోవడం ఖాయం. సెయోన్ మీద అతనికి చాలా ఆశలున్నాయి. పెర్ఫార్మన్స్ పరంగా ఛాలెంజింగ్ పాత్ర కావడంతో పాటు కాంతార తరహాలో డివోషనల్ ఎలిమెంట్స్ పుష్కలంగా దట్టించారు. శివకుమార్ మురుగేషన్ దీనికి దర్శకుడు. కమల్ కల్ట్ మూవీ పోతురాజు బ్యాక్ డ్రాప్ లో తీసిన సెయోన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates