హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కట్ చేసిన నితిన్ ‘చెక్’ టీజర్ జనవరి 1న కాకుండా జనవరి 3న రావడం ఫాన్స్ని ఆశ్చర్య పరచింది. అయితే ఈ టీజర్ ఇప్పుడు విడుదల చేయాలనే ప్లాన్ ముందు లేదట. నిజానికి ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈలోగా నితిన్ రంగ్‍దే రిలీజ్ అయిపోతుందని భావించారు.
రంగ్ దే సంక్రాంతికి కానీ, ఫిబ్రవరిలో కానీ విడుదలవుతుందని భావించారు. కానీ ఆ చిత్ర నిర్మాతలు మార్చి 26న విడుదల చేస్తున్నట్టు జనవరి 1న అనౌన్స్ చేసారు. దాంతో ఈలోగా చెక్ విడుదల చేసుకుంటే వర్కవుట్ అవుతుందని భావించి పనులు వేగవంతం చేసారు. ఇంకా కొద్ది రోజుల షూట్ బ్యాలెన్స్ వుందట. దానికి నితిన్‍ని ఒప్పించి పూర్తి చేయాలని చూస్తున్నారు. టీజర్ కట్ చేసి విడుదల చేయడంతో ఇప్పుడీ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.
ఓటిటి ట్రెండ్‍కి తగ్గ సినిమాలు తీసే దర్శకుడు కావడంతో చంద్రశేఖర్ యేలేటి సినిమాకు ఓటిటి కంపెనీల నుంచి కూడా ఆఫర్లు బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి రావడం కష్టం కానీ ఫిబ్రవరిలో చెక్ విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే థియేటర్లలోనా లేక ఓటిటి రిలీజా అనేది ఇంకా డిసైడ్ అవలేదు.
This post was last modified on January 4, 2021 11:31 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…