Movie News

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు. భారీ చిత్రాలు, హిట్ టాక్ తెచ్చుకున్నవి కూడా పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడం గగనం అయిపోతోంది.

ఒకప్పుడు వైభవం చూసిన దిల్ రాజు సైతం సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ కూడా తడబడుతూ సాగుతోంది. సితార నాగవంశీకి కూడా పరిస్థితులు అంతగా కలిసి రావడం లేదు. ఇలాంటి టైంలో అంతగా పాపులర్ కాని, మిడ్ రేంజ్ సినిమాలు చేసే ప్రొడ్యూసర్.. నిలకడగా సక్సెస్‌లు అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అతనే.. షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి.

సాహుకు కొన్నేళ్లుగా భలే కలిసొస్తోంది. అతడికి అనిల్ రావిపూడి రూపంలో ఒక జాక్‌పాట్ లాంటి డైరెక్టర్ దొరికాడు. అతడితో అనుబంధం సాహుకు వరుసగా విజయాలందిస్తోంది. షైన్ స్క్రీన్స్‌లో బాాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ తీసి సాహుకు మూడేళ్ల ముందు పెద్ద విజయాన్నందించాడు అనిల్.

ఆ తర్వాత సాహు.. ‘కిష్కింధపురి’తో గత ఏడాది హిట్టు కొట్టాడు. ఈ ఏడాదైతే సాహు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంది. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కెరీర్లోనే అతి పెద్ద విజయాన్నందించింది. ఈ చిత్రంలో భారీగా లాభాలందుకున్నాడు సాహు.
ఇక మలయాళంలో తక్కువ బడ్జెట్లో చేసిన ‘వాళా-2’ సెన్సేషన్ క్రియేట్ చేసి సాహుకు భారీ లాభం తెచ్చిపెట్టింది.

ఇప్పుడేమో వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రూపొందిస్తున్న కొత్త సినిమాను కూడా తన సంస్థలోనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు సాహు. ఈ సినిమా పెద్ద హిట్ అని ఇండస్ట్రీ ముదే ఫిక్స్ అయిపోయింది. సాహుకు మరో జాక్‌పాట్ ఖాయమని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సాహులా మరే నిర్మాతా ఇంత నిలకడగా విజయాలు సాధించట్లేదు.

This post was last modified on June 18, 2026 4:42 pm

Share

Recent Posts

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

47 minutes ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

2 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

2 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

4 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

6 hours ago