Movie News

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో అర్థం తీసుకోవాలి. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం చూసి నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్ల గురించి జరుగుతున్న ప్రచారం అయోమయానికి గురి చేస్తోంది. అసలేం జరుగుతోందో చూద్దాం.

ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఫౌజీ దసరా పండక్కు రావాలి. కానీ ఆలస్యం వల్ల ఇప్పుడా ఛాన్స్ లేదు. ఆ స్లాట్ కోసం వెంకటేష్ ఆదర్శ కుటుంబం, బాలయ్య 111 కన్నేసి ఉంచాయి. ఒకవేళ వీటిలో ఏదైనా ఒకటి రాకపోతే చిరంజీవి విశ్వంభరని దించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికైతే ఈ మూడింటిలో ఏదీ కన్ఫర్మ్ చేసుకోలేదు. సరే ఇది పోతే పోయిందనుకుంటే ఫౌజీకున్న నెక్స్ట్ ఆప్షన్ డిసెంబర్. సాలార్, యానిమల్, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చిన నెల అది.

కానీ అప్పటికైనా షూట్ అయిపోతుందా అంటే సరైన సమాధానం దొరకడం లేదు. ప్రభాస్ ఇది జరుగుతుండగానే స్పిరిట్, కల్కి 2 సెట్స్ మీదకు తీసుకురావడం సమస్యగా మారిందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో స్పిరిట్ విడుదల చేయాలనీ సందీప్ రెడ్డి వంగా ఫిక్స్ అయిపోయారు. నిర్మాణ భాగస్వామి టి సిరీస్ అన్నీ చూసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ లో కాంపిటీషన్ లేకుండా ఉండేలా ఆ డేట్ సెట్ చేసుకుంది.

అది మిస్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏప్రిల్ లో వారణాసి వస్తుంది కాబట్టి మళ్ళీ లేనిపోని ఇబ్బంది తలెత్తుతుంది. అలాంటప్పుడు ఫౌజీకి దారి ఎక్కడ దొరుకుతుంది. సో ఖచ్చితంగా డిసెంబర్ లో రావాలనేది ఫ్యాన్స్ డిమాండ్. లేదంటే ఏకంగా 2027 వేసవికి వెళ్లాల్సి ఉంటుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్ గా నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. విజయదశమికి టీజర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 

This post was last modified on June 16, 2026 8:05 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago