తన కలల ప్రాజెక్టు మహాభారతం గురించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడాడు రాజమౌళి. ఆ సినిమా తీయడానికి పదేళ్లు పడుతుందని జక్కన్న చెప్పి నాలుగైదేళ్లు కావస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్.. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా పూర్తయ్యే సమయానికి మహాభారతం చేసేందుకు ముహూర్తం కుదురుతుందేమో.. అప్పుడు మొదలుపెడితే.. జక్కన్న ముందు ప్రకటన చేసినప్పటి నుంచి పదేళ్లకు మహాభారతం సినిమాలో ఒక పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రాజమౌళి ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో మహాభారతం మీద వర్క్ ఏమైనా మొదలుపెట్టారేమో అన్న ఆలోచనా కలుగుతోంది. ఇటీవల రాజమౌళి మేక్ మహాభారతం అంటూ ఉత్తరాది జనాలు ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం.. దీని మీద పెద్ద చర్చ నడవడం తెలిసిన సంగతే.
ఈ నేపథ్యంలో జక్కన్నను తన కలల ప్రాజెక్టు గురించి అడిగితే.. మహాభారతం పనులు మొదలుపెట్టాల్సిందే అని.. కానీ దానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఖాళీ దొరికింది కదా అని దాని మీద కూర్చుని పని చేసే ప్రాజెక్టు ఇది కాదని జక్కన్న స్పష్టం చేశాడు.
చాలా శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలని.. పూర్తిగా దాని మీదే దృష్టిసారించాలని.. అప్పుడు కానీ మహాభారతం ప్రాజెక్టును మొదలుపెట్టలేమని రాజమౌళి అన్నాడు. కాబట్టి చేతిలో ఉన్న కమిట్మెంట్లన్నీ పూర్తయి.. ఇక మహాభారతం చేద్దామనుకున్నపుడే రాజమౌళి ఆ సినిమా పనులు తలకెత్తుకుంటాడన్నమాట.
This post was last modified on May 5, 2020 9:27 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…