మీడియం రేంజ్ హీరోల్లో విరామం లేకుండా ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు చేసే కథానాయకుడు నాని. అతడి స్థాయి కంటే తక్కువలో చూసుకుంటే వరుసబెట్టి సినిమాలు ఓకే చేసి చకచకా ముగించేస్తున్న హీరో సత్యదేవ్‌యే. కెరీర్లో నిలదొక్కుకోవడానికి కొన్నేళ్లు కష్టపడ్డ సత్యదేవ్‌కు గత ఏడాది బాగానే కలిసొచ్చింది. ఓటీటీలో రిలీజైన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి ఫలితమే అందుకుంది. అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా తర్వాత సత్యదేవ్‌కు వరుసగా అవకాశాలు వస్తుండటం విశేషం. ఇప్పటికే అతను ‘తిమ్మరసు’ అనే సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేసేస్తున్నాడు. ఈ మధ్యే దాని టీజర్ కూడా విడుదలైంది. దాంతో పాటే సత్యదేవ్, తమన్నా జంటగా ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో ఇంకో సినిమా కూడా మొదలైంది. అది కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చేయనున్న ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ సత్యదేవ్‌కు ఓ కీలక పాత్ర దక్కినట్లు వార్తలొస్తున్నాయి. ఇంతలో ఇప్పుడు సత్యదేవ్ హీరోగా ఇంకో చిత్రం మొదలైంది. ఆ సినిమా పేరు.. గాడ్సే. నేరుగా ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. సత్యదేవ్ పెద్ద గన్ను పట్టుకుని గ్యాంగ్‌స్టర్ తరహాలో కనిపిస్తున్నాడు. సినిమా ఫుల్ యాక్షన్ టైప్ అని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాతో సత్యదేవ్ మాస్ ఇమేజ్ సంపాదిస్తాడేమో చూడాలి.
ఇంతకుముందు సత్యదేవ్‌తో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను రూపొందించిన గోపి గణేష్ పట్టాభి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ‘బ్లఫ్ మాస్టర్’ రీమేక్ కాగా.. ఈసారి సొంత కథతోనే గణేష్ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేయనుండటం విశేషం. ఇంటిలిజెంట్, రూలర్ లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత ఆయన స్థాయి తగ్గించుకుని ఈ చిన్న సినిమా చేస్తున్నారు.
This post was last modified on January 3, 2021 4:20 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…