ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్ దక్కి చాలా సంవత్సరాలు అయ్యింది. పెద్దితో పాటు ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ హై జవాని తో ఇష్క్ హోనా హై కూడా ఫ్లాపుల లిస్టులో చేరిపోయింది. సోషల్ మీడియా క్రిటిక్స్ నలభై ఏభై కోట్లు అంటూ ఊదరగొడుతున్నారు కానీ మొదటి వారం పూర్తివుతున్న టైంలో ఇంకా వంద కోట్ల మార్క్ చేరుకోలేకపోవడం ఫెయిల్యూర్ కిందకు వస్తుంది.
ఇందులో వరుణ్ ధావన్ హీరో కాగా మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ గా నటించింది. పరమ రొటీన్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పెద్దగా మద్దతు లేదు. దీని వల్ల పూజా హెగ్డేకు ఒరిగే ప్రయోజనం సున్నానే చెప్పాలి. దీనికి ముందు సూర్య రెట్రో, షాహిద్ కపూర్ దేవా, సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్, రణ్వీర్ సింగ్ సర్కస్, రామ్ చరణ్ ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్ ఒకదాన్ని మించి మరొకటి పోయాయి. ఒక్క విజయ్ బీస్ట్ మాత్రమే తమిళంలో గట్టెక్కింది.
ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా పూజా బిజీగానే ఉంది. భగవంత్ కేసరి రీమేక్ జన నాయకుడులో కాజల్ అగర్వాల్ చేసిన పాత్రను పోషించింది. దుల్కర్ సల్మాన్ తో ఒక రామ్ కామ్ చేస్తోంది. రాఘవేంద్ర లారెన్స్ కాంచన 4లో కెరీర్ లో మొదటిసారి హారర్ పాత్రలో భయపెట్టనుంది. ఇది చాలా షాకింగ్ లుక్ తో ఉంటుందని సమాచారం. ఇవి కనక సక్సెస్ అయితే మళ్ళీ ట్రాక్ లో పడొచ్చు. ముఖ్యంగా కాంచన తనకు పెద్ద బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం.
ఇండస్ట్రీకి వచ్చిన పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న పూజా హెగ్డే ఇకపై ఇన్నింగ్స్ కొనసాగించాలంటే మంచి కాంబోలు హిట్లు పడాలి. నయనతార, తమన్నా, త్రిష ఇప్పటికీ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయస్ గా ఉన్నారు. వాళ్ళ లాగా సుదీర్ఘంగా కొనసాగాలంటే పవర్ ఫుల్ క్యారెక్టర్స్ పడాలి. రెట్రోలో డీ గ్లామర్ తో మంచి నటన చూపించినా లాభం లేకపోయింది. ఇండస్ట్రీ హిట్ ఆల వైకుంఠపురములో తర్వాత పూజా హెగ్డే నుంచి మళ్ళీ ఆ స్థాయి సినిమా చూడలేదు, ఫలితమూ రాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates