ఇండియాలో వివిధ భాషల్లో ఒకే కథాంశంతో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ అగ్ర భాగాన నిలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రూ.30 కోట్ల లోపు మార్కెట్ ఉన్న మళయాల సినిమా స్థాయిని దృశ్యం ఏకంగా రూ.50 కోట్లు దాటించేసింది. అక్కడ ఆ స్థాయి గ్రాస్ సాధించిన తొలి చిత్రం అదే.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తే అన్ని చోట్లా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కథను మొదలుపెట్టి కొత్త కథను చెప్పబోతున్నారిందులో. అంటే ఇది పక్కా సీక్వెల్ అన్నమాట. మొదలైన నెలన్నరలోనే ఈ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే విడుదల కాబోతోంది.
ఐతే ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఐతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడు అందరి దృష్టీ సీక్వెల్ మీద నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసి మంచి ఫలితాన్నందుకున్న వెంకటేష్ సీక్వెల్‌ను కూడా రీమేక్ చేయొచ్చని అనుకున్నారు. ఆయనకు రీమేక్‌ల్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ‘దృశ్యం-2’ ఆడితే.. దాన్ని కూడా రీమేక్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే ‘దృశ్యం-2’ నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ ‘దృశ్యం’ వచ్చినపుడు ఓటీటీల సందడి లేదు. పైగా మలయాళ సినిమాల మీద మనోళ్ల దృష్టి తక్కువే. కానీ ఇప్పుడు ఆ భాషా చిత్రాలకు బాగా అలవాటు పడ్డారు. అమేజాన్ ప్రైమ్ కూడా బాగా అలవాటైపోయింది. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే తెలుగు వాళ్లు ఆ చిత్రాన్ని ఓటీటీలో పెద్ద ఎత్తున చూసే అవకాశముంది. ఇలా అందరూ చూసేశాక, కథేంటో తెలిసిపోయాక రీమేక్ చేసి పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ‘దృశ్యం-2’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ దీన్ని వెంకీ రీమేక్ చేసే అవకాశాలు లేనట్లే.
This post was last modified on January 3, 2021 11:19 am
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…