విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. టీజర్ తో పాటుగా దీని అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులైనా బిజినెస్ డీల్స్ వల్ల లేట్ అయిన ఈ కామెడీ హారర్ డ్రామాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. కొరియా దేశానికి తెలుగోళ్లకు ముడిపెడుతూ ఒక వెరైటీ ట్రీట్ మెంట్ తో తెరకెక్కించారట.
ఈ కొరియన్ కనకరాజుకి ముడిపడి చాలా విషయాలున్నాయి. మొదటిది వరుణ్ తేజ్ కు అర్జెంట్ గా సక్సెస్ దక్కాలి. ఆల్రెడీ తన మార్కెట్ రిస్క్ లో ఉంది. వరస డిజాస్టర్లు ఇమేజ్ మీద ప్రభావం చూపించాయి. మళ్ళీ కంబ్యాక్ కావడానికి ఇదే మంచి అవకాశం. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒకప్పుడు శర్వానంద్, నాని లాంటి స్టార్లను డీల్ చేసి తర్వాత వరస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఆయనకు సైతం ఇది హిట్ కావడం చాలా అవసరం. సో ప్రాణం పెట్టేసి ఉండాలి.
ఇక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏడాది ఇచ్చిన రెండు సినిమా కపుల్ ఫ్రెండ్లీ, బైకర్ మంచి పేరు అయితే తీసుకొచ్చాయి కానీ గర్వంగా చెప్పుకునే డబ్బులు అయితే కాదు. నిన్న సంవత్సరం ఘాటీ దారుణంగా పోయింది. విశ్వంభర ల్యాబ్ నుంచి బయటికి రావడం లేదు. విఎఫెక్స్ ని సాకుగా చెబుతున్నారు తప్పించి ఓటిటి డీల్ ఆలస్యం వల్లే ఇంకా థియేటర్లకు రావడం లేదని సీన్ వర్గాల టాక్.
ఇదంతా ఎలా కొరియన్ కనకరాజు కనక హిట్టు కొడితే ఇందరికి ప్లస్ అవుతుంది. ఆగస్ట్ 7 ఒకరకంగా మంచి డేట్. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే లక్ష్యంగా చేసుకున్న జైలర్ 2 వాయిదా పడింది. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ జానర్ వేరే కాబట్టి టెన్షన్ లేదు. ఆపై ఆగస్ట్ 21 రవితేజ ఇరుముడి ఉంది. నాని ప్యారడైజ్ దాదాపు తప్పుకున్నట్టే. సో టాక్ బాగుంటే రెండు వారాలు లక్షణంగా సరిపోయే కొరియన్ కనకరాజు మరి చిరు, చరణ్ లాగా 2026లో హిట్టు బోణీ కొడతాడో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates