పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ మళ్లీ ఓ సినిమా తీయాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ మ్యాజికల్ కాంబినేషన్‌ను మళ్లీ చూడాలన్న అభిమానుల ఆశకు కొన్ని నెలల కిందటే జీవం వచ్చింది. పవన్, హరీష్ కలయికలో సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసింది. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
రీఎంట్రీలో పవన్ మూడో సినిమాగా ఇదే ఉంటుందని అనుకున్నారు కానీ.. మధ్యలో ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను పవన్ తెరపైకి తేవడం.. క్రిష్ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐతే నూతన సంవత్సరాది సందర్భంగా పవన్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి హరీష్‌తో పాటు మైత్రీ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ వెళ్లారు.
ఈ సందర్భంగా తమ కలయికలో రావాల్సిన సినిమా గురించి హరీష్, రవిశంకర్‌లకు ఒక క్లారిటీ ఇచ్చేశాడట పవన్. ‘వకీల్ సాబ్’ పూర్తయిన నేపథ్యంలో తాను ఒకేసారి క్రిష్ సినిమాతో పాటు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లోనూ నటిస్తానని.. సాధ్యమైనంత త్వరగా ఈ రెండు చిత్రాలనూ పూర్తి చేసి ఈ ఏడాదే.. హరీష్ దర్శకత్వంలో నటిస్తానని పవన్ హామీ ఇచ్చాడట.
పవన్‌తో మీటింగ్ ప్రొడెక్టివ్‌గా సాగిందని.. ఇదేదో సరదాకు జరిగిన మీటింగ్ కాదని.. ఒక భారీ ప్రాజెక్టుకు ఇది ఆరంభం అని ట్విట్టర్లో హరీష్ పేర్కొన్నాడు. తనకు వేరే ఆఫర్లు వచ్చినప్పటికీ.. తన ఎనర్జీ మొత్తం పవన్ సినిమా మీదే పెట్టాలని, డీవియేట్ కాకూడదనే ఉద్దేశంతో హరీష్.. ఈ ప్రాజెక్టుకే అంకితం అయ్యాడు. అతను గత ఏఢాదే స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు మరింతగా దానికి మెరుగులు దిద్దుకునే పనిలో ఉన్నాడు. మైత్రీ వాళ్ల నుంచి కొన్నేళ్ల కిందట అడ్వాన్స్ తీసుకున్న పవన్.. ఎట్టకేలకు వారికి సినిమా చేస్తున్నాడు.
This post was last modified on January 2, 2021 11:09 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……