Movie News

ఆల్ టైం డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో ధ‌నుష్‌

తెలుగులో గోపీచంద్ హీరోగా శౌర్యం అనే సూప‌ర్ హిట్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు త‌మిళ సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌. ఆ త‌ర్వాత గోపీచంద్‌తోనే అత‌ను తీసిన శంఖం సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ.. త‌మిళంలో విక్ర‌మార్కుడు రీమేక్ సిరుత్తైతో సూప‌ర్ హిట్ కొట్టి అక్క‌డ ద‌ర్శ‌కుడిగా స్థిర‌ప‌డిపోయాడు శివ‌.

అజిత్ లాంటి పెద్ద హీరో అత‌డికి ఛాన్సివ్వ‌గా.. వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు తీసి ద‌ర్శ‌కుడిగా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. కానీ విశ్వాసం త‌ర్వాత శివ‌కు ఏమాత్రం క‌లిసి రాలేదు.

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో చేసిన అన్నాత్తే పెద్ద డిజాస్ట‌ర్ అయి శివ పేరును బాగా చెడ‌గొట్టింది. అయినా స‌రే సూర్య అత‌ణ్ని న‌మ్మి భారీ బ‌డ్జెట్లో కంగువ సినిమా చేశాడు. ఇది త‌మిళంలో రోబో-2 త‌ర్వాత అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన చిత్రం. ఇది త‌మిళ సినీ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టేస్తుంద‌నే అంచ‌నాలు ఏర్పడ్డాయి రిలీజ్ ముంగిట‌. కానీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతోనే అంచ‌నాల‌న్నీ కూలిపోయాయి. త‌మిళంలో అత్య‌ధిక న‌ష్టాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచింది కంగువ‌.

ఇక అప్ప‌ట్నుంచి శివ‌కు ఇంకో సినిమా అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మైపోయింది. కంగువ‌-2 ప్లాన చేసుకున్నాడు కానీ.. కంగువ డిజాస్ట‌ర్ కావ‌డంతో దాని జోలికి వెళ్లే అవ‌కాశం లేక‌పోయింది. గ‌తంలో మూడు సినిమాల‌కు అవ‌కాశ‌మిచ్చిన అజిత్ స‌హా ఏ స్టార్ హీరో అత‌డికి డేట్లు ఇవ్వ‌లేదు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ధ‌నుష్.. శివ క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ధ‌నుష్ అంటే ప్ర‌యోగాల‌కు పెట్టింది పేరు. ఎప్పుడో కానీ మాస్ సినిమా చేయ‌డు. అందులోనూ శివ లాంటి ఊర మాస్ ద‌ర్శ‌కుల జోలికి అత‌ను వెళ్ల‌డు.

పైగా ఇప్పుడు శివ ఎలాంటి ఫాంలో ఉన్నాడో తెలిసిందే. ఈ ద‌శ‌లో శివ‌తో ధ‌నుష్ సినిమా ఊహించ‌లేనిదే. ఐతే ధ‌నుష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ ఒకింత నిరాశ‌కు గురి చేస్తున్న నేప‌థ్యంలో అభిమానులు అత‌డి నుంచి మంచి మాస్ మూవీ ఆశిస్తున్నారు.. ధ‌నుష్ చివ‌రి చిత్రం క‌ర డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో త‌న ఆలోచ‌న మారిన‌ట్లుంది. మ‌రి కంగువ ఫెయిల్యూర్‌ను మ‌రిపించేలా ధ‌నుష్‌తో హిట్టు కొట్టి శివ త‌నేంటో మ‌ళ్లీ రుజువు చేస్తాడేమో చూడాలి.

This post was last modified on June 6, 2026 8:26 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

54 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago