Movie News

సమంత బంగారానికి మంచి ఛాన్స్

ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా గ్యాప్ తీసుకుని తన స్వీయ నిర్మాణంలో చేసిన సినిమా మా ఇంటి బంగారం జూన్ 19 విడుదలకు రెడీ అవుతోంది. నిజానికిది మే రెండో వారంలోనే రావాల్సింది. కానీ ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడం, ప్రాజెక్టుని పర్యవేక్షిస్తున్న సామ్ భర్త రాజ్ నిడిమోరు సలహా మేరకు ఆగిపోయారు. అదే సమయంలో సూర్య కరుప్పు రిలీజయ్యింది.

ఊహించని విధంగా అది బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒకవేళ మా ఇంటి బంగారం కనక దాంతో క్లాష్ అయ్యి ఉంటే సామ్ తమిళ వెర్షన్ కు ఇబ్బందులు వచ్చేవి. ఆ రకంగా సేఫ్ గేమ్ ఆడారని చెప్పాలి. అదే సమయంలో నైజామ్ లో సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ గొడవ జరుగుతోంది. అదో సమస్యగా మారేది. ఇవేవి లేకుండా ప్రశాంతంగా జూన్ 19కి వెళ్లిపోవడం మేలే చేసింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదే రామ్ చరణ్ పెద్ది.

పలు వాయిదాల తర్వాత మెగా పవర్ స్టార్ థియేటర్లలో అడుగుపెట్టారు. రెస్పాన్స్, పబ్లిక్ టాక్స్ బాగానే ఉన్నాయి. కొంత మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ తర్వాత సాలిడ్ గా నిలబడుతుందని ట్రేడ్ నమ్ముతోంది. అయితే ఎంత రన్ వచ్చినా రెండు వారాల తర్వాత నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2 లాంటి యునివర్సల్ మాస్ అప్పీల్ ఉన్న సినిమా కాకపోవడంతో బిసి సెంటర్స్ లో ఎంత మేర లాంగ్ రన్ వస్తుందనేది వేచి చూడాలి.

మా ఇంటి బంగారంకు పెద్ద కాంపిటీషన్ సమస్య లేదు. దీవానాని గీత ఆర్ట్స్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు కానీ అది ఇంటెన్స్ లవ్ స్టోరీ కాబట్టి సామ్ కు ఎలాంటి చిక్కు ఉండదు. జానర్ పరంగాన పోలికలు వచ్చే ప్రసక్తే ఉండదు. అయితే వారం తర్వాత అఖిల్ లెనిన్ జూన్ 26 వచ్చేస్తుంది. ఈలోగా మా ఇంటి బంగారం మూవీకి యునానిమస్ టాక్ వస్తే ఎంత కాంపిటీషన్ వచ్చినా నిలదొక్కుకోవచ్చు. దర్శకురాలు నందిని రెడ్డికి ఇది హిట్ కావడం చాలా అవసరం.

This post was last modified on June 5, 2026 6:05 pm

Share

Recent Posts

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

37 minutes ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

1 hour ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

2 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

3 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

4 hours ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

5 hours ago