ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘బాహుబలి’ సంచలనాలు చూశాక వివిధ పరిశ్రమల వాళ్లకు అలాంటి భారీ చిత్రం చేయాలని కోరిక పుట్టింది. మలయాళంలో ఇప్పటికే కొన్ని భారీ ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి ఏ రకంగానూ ‘బాహుబలి’కి దరిదాపుల్లో నిలవలేకపోయాయి. ఐతే ఇప్పుడు మలయాళ పరిశ్రమలో బిగ్గెస్ట్ హీరో, బిగ్గెస్ట్ డైరెక్టర్ కలిసి ‘బాహుబలి’ తరహా భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే. ఆ ఇద్దరూ మోహన్ లాల్, ప్రియదర్శన్ కాగా.. వీరి కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మరక్కార్’. గత ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. విడుదలకు అంతా సిద్ధం చేశాక.. కరోనా వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసేసింది. ఇటీవలే కేరళలో థియేటర్లు తెరుచుకోగా.. ఇంతటి భారీ చిత్రాన్ని 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో విడుదల చేయడం కరెక్ట్ కాదని ఆగుతున్నారు.
ఇండియాలో వ్యాక్సినేషన్‌కు జోరుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వేసవి సమయానికి దేశవ్యాప్తంగా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేసవి సీజన్ ఆరంభంలోనే ‘మరక్కార్’ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మార్చి 26న ‘మరక్కార్’ రిలీజ్ అంటూ ఒక గ్రాండ్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మోహన్ లాల్‌తో ప్రియదర్శన్ 30కి పైగా సినిమాలు తీయడం విశేషం. ఐతే ఇన్నేళ్లలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ఒకెత్తయితే.. ‘మరక్కార్’ మరో ఎత్తు. మలయాళంలో ఇప్పటిదాకా ఇంత పెద్ద బడ్జెట్లో ఏ సినిమా తెరకెక్కలేదు. సముద్రం మీద తన అనుచరులతో కలిసి బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఓ భారత వీరుడి కథ ఇది. దీని టీజర్ చూస్తే హాలీవుడ్ ఫేమస్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ ఛాయలు కనిపించాయి. ప్రపంచ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గని భారీతనం, నిర్మాణ విలువలు సినిమాలో కనిపిస్తున్నాయి. విజువల్స్, ఎఫెక్ట్స్ అన్నీ భారీగానే ఉండేలా చూసుకున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే మలయాళ సినిమా రికార్డులను తిరగరాసే అవకాశముంది.
This post was last modified on January 2, 2021 8:34 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…