మహేష్ బాబు కెరీర్‌ను ‘ఒక్కడు’ సినిమాకు ముందు, ‘ఒక్కడు’ సినిమాకు తర్వాత అని విభజించి చూడాల్సిందే. దానికి ముందు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’, ‘మురారి’ సినిమాలు పెద్ద విజయాలే సాధించినప్పటికీ ‘ఒక్కడు’ సూపర్ స్టార్‌కు గేమ్ చేంజర్ అయ్యింది. ఆ సినిమాతో యూత్‌లో, మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. తన బాక్సాఫీస్ స్టామినాను అమాంతం పెంచుకున్నాడు. తండ్రి నుంచి ‘సూపర్ స్టార్’ ట్యాగ్‌ను తీసుకునేందుకు అర్హత సాధించాడు. ఐతే ఇలాంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఎం.ఎస్.రాజుతో మహేష్ మళ్లీ ఇంకో సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. ఆయన మంచి ఫాంలో ఉండగా.. మళ్లీ మహేష్‌తో మరో సినిమా చేయడానికి ప్రయత్నించాడో లేదో తెలియదు. బేనర్ వాల్యూ పడిపోయాక రాజు అడిగినా.. మహేష్ రాజుతో పని చేయడానికి ఆసక్తి చూపించి ఉండకపోవచ్చేమో.
ఐతే కొన్నేళ్ల కిందటే ప్రొడక్షన్ ఆపేసి.. కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రాజు.. ఈ మధ్యే దర్శకుడిగా ‘డర్టీ హరి’ అనే బోల్డ్ సినిమాను అందించారు. ఆ సినిమాకు ఆర్థికంగా మంచి ఫలితమే దక్కింది. రాజు ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే కంటెంట్ పరంగానూ ఇది మెరుగ్గానే అనిపించింది. యువత అభిరుచిపై ఆయనకు పట్టుందన్న సంగతి ఈ సినిమాతో అర్థమైంది. ఈ ఊపులో మళ్లీ ప్రొడక్షన్లోనూ బిజీ కావాలనుకుంటున్న రాజు.. తాను మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలున్నట్లు ట్విట్టర్లో సంకేతాలు ఇవ్వడం విశేషం. మహేష్‌తో సినిమా ఉంటుందా అని ఓ నెటిజన్ ఆయన్ని అడిగితే.. తప్పకుండా అని రాజు చెప్పాడు. మహేష్‌తో సినిమా చేస్తే ‘ఒక్కడు-2’నే తీయండి, గుణశేఖర్‌నే దర్శకుడిగా పెట్టుకోండి అని ఓ నెటిజన్ అంటే.. ‘‘అంతేగా’’ అని బదులిచ్చాడు రాజు. మరి మహేష్‌తో ఒక్కడు-2 ఎఫ్పుడు మొదలుపెడతారని మరో నెటిజన్ అడిగితే.. ఇంకో నెల రోజుల్లో వివరాలు చెబుతా అన్నారు రాజు. మరి నిజంగా ఒక్కడు కాంబినేషన్‌ను రాజు రిపీట్ చేయగలిగాడంటే టాలీవుడ్లో అదో సెన్సేషనల్ న్యూస్ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 2, 2021 8:33 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…