మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన వసూళ్లు ట్రేడ్ ని షాక్ కు గురి చేశాయి. ఆ టైంలో వచ్చిన కొత్త మూవీస్ దీని వల్ల ఇబ్బంది పడటం ఊహించని పరిణామం. రామ్ చరణ్ ఆరంజ్ కూడా ఇదే తరహాలో మేజిక్ చేయడం నిర్మాత నాగబాబుకి ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రతిసారి ఇలా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. దానికి ఉదాహరణ తాజాగా వచ్చిన అతిథి.
ఈ నెల 31 సూపర్ స్టార్ కృష్ణగారి జయంతిని పురస్కరించుకుని అతిథిని ప్రత్యేకంగా రీ మాస్టర్ చేసి ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో కొన్ని సింగల్ స్క్రీన్స్ లో తప్ప మిగిలిన చోట ఆశించిన స్పందన లేదన్నది వాస్తవం. ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు తీసికట్టుగా ఉన్నాయి. మహేష్ బలమైన కోటగా చెప్పుకునే యుఎస్ లో కనీసం అయిదు వందల టికెట్లు అమ్ముడపోలేకపోవడం విచిత్రమే.
ఇక్కడ ప్రాక్టికల్ గా గమనించాల్సిన అంశం ఒకటుంది. అతిథి అంచనాలు అందుకోలేక ఫెయిలైన మూవీ. ఖలేజాలాగా దాంట్లో డెప్త్ కంటెంట్ ఉండదు. దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన విధానం టెక్నికల్ గా బాగున్నప్పటికీ అది కామన్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇప్పుడేదో రీ ఎడిటింగ్, రీమిక్స్ అంటూ ప్రయోగాలు చేశారు కానీ జనం లైట్ తీసుకున్నారు. క్రమం తప్పకుండ చేసిన ప్రమోషన్లు ఉపయోగపడలేదు.
ఇదే కాదు రేపు 1 నేనొక్కడినే పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. మహేష్ బాబు చేసిందే 28 సినిమాలు. వాటిని ఇంత తక్కువ గ్యాప్ లో వరసగా రీ రిలీజులు చేసుకుంటూ పోతే ఇదే రిపీట్ అవుతుంది. కొంచెం సమయం సందర్భం చూసుకుని సంవత్సరానికి ఒకటి రెండు చేస్తే బాగుంటుంది కానీ ఇలా నెలకు ఒకటి రెండు వదిలితే ఫ్యాన్స్ కే బోర్ కొట్టడం ఖాయం. ఇటీవలే ఊసరవెల్లి, ఆంధ్రావాలా, కృష్ణ రీ రిలీజులు సైతం సరైన రెస్పాన్స్ లేక రీరిలీజ్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.
This post was last modified on May 29, 2026 6:19 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…