సౌత్ ఇండియా సినిమాల్లో విజువల్ గ్రాండియర్స్ పరిచయం చేసిన మొదటి పేరు శంకర్. జెంటిల్ మెన్ నుంచి గేమ్ ఛేంజర్ దాకా ఆయన మీడియం బడ్జెట్ లో తీసిన సినిమా ఒక్కటీ లేదు. 3 ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు కొంచెం మినహాయింపుగా అనిపించినా క్యాస్టింగ్ కోణంలో చూసుకుంటే ఒక పెద్ద మూవీకి సమానంగా కనిపిస్తుంది. అయితే అప్పటి బ్రాండ్ వేల్యూ ఇప్పటి శంకర్ లో లేదన్నది వాస్తవం. ముఖ్యంగా భారతీయుడు 2 చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
దీంతో శంకర్ డ్రీం ప్రాజెక్టు వేల్పరికు అడుగులు ముందుకు పడటం లేదు. మూడు భాగాలతో అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్నారు కానీ ఎటొచ్చి ప్రొడ్యూసర్స్ దొరకడం లేదు. ఇండియన్ 3 నెలల తరబడి ల్యాబులో మగ్గుతోంది. విడుదల చేయాలంటే బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయాలి. కమల్ హాసన్ కు ఆసక్తి లేదు. నిర్మాణ సంస్థ లైకాకు ఆర్థిక చిక్కుల వల్ల మరింత డబ్బులు పొసే ఉద్దేశంలో లేదు. పోనీ ఓటిటిలో వదిలేద్దామా అంటే ప్రెస్టీజ్ సమస్య.
ఈ కారణాల వల్ల వేల్పరి కోసం ఎవరూ ముందుకు రావడం లేదట. ఒకరిద్దరు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ శంకర్ ఎలా తెరకెక్కిస్తారనే అనుమానం ఉండిపోవడం వల్ల శంకర్ ఒక నిర్ణయం తీసుకున్నారని చెన్నై టాక్. వీలైనంత వేగంగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తక్కువ సమయంలో తీసి తానేంటో ఋజువు చేసే ప్రయత్నంలో ఉన్నారట. ఒక యాభై నుంచి వంద కోట్ల లోపు పూర్తి చేసే పనైతే ఎవరో ఒక నిర్మాత తప్పకుండా లైన్ లోకి వస్తారు.
సో మరి శంకర్ ఎవరిని హీరోగా తీసుకుంటారో క్యాస్టింగ్ ఎలా సెట్ చేసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఖైదీ, విక్రమ్ తరహాలో బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేయని సబ్జెక్టుని రాసుకున్నారని తెలిసింది. మూడేళ్ళ పాటు గేమ్ చేంజర్ తీసి డిజాస్టర్ ఇచ్చిన శంకర్ ఇప్పుడు అతి తక్కువ సమయంలో వండర్ చేస్తారంటే ఆశ్చర్యం కలిగించినా ఇదే మంచిది. ఎందుకంటే ఫలితం ఒకవేళ అటుఇటు అయితే నష్టం తక్కువగా ఉంటుంది. క్లిక్ అయితే వేల్పరికి దారి దొరుకుతుంది.
This post was last modified on May 29, 2026 7:33 am
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…