దర్శకుడు ఆర్జె బాలాజీ పేరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. తెలుగులో నెగటివ్, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దేవుడితో ముడిపెట్టిన కమర్షియల్ ఎలిమెంట్స్ మన ఆడియన్స్ కి కూడా నచ్చడంతో ఇక్కడా విజయం సాధించడం అనూహ్యం. రెండు వందల యాభై కోట్ల మార్కుని దాటేసిన కరుప్పు / వీరభద్రుడు నెక్స్ట్ ట్రిపుల్ సెంచరీ దాటేందుకు రెడీ కావడం విశేషం. తమిళనాడులో మూడో వారం దగ్గరలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బయ్యర్లను ఆనందంలో ముంచెత్తుతోంది.
ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి. ఆర్జె బాలాజీ మొదటిసారి దర్శకుడిగా మారింది మూకుతి అమ్మన్ సినిమాతో. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. నేరుగా ఓటిటిలో రిలీజయ్యింది. మంచి పేరే తెచ్చింది. తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ బాదాయీ హోని తనే హీరోగా వీట్ల విశేషం పేరుతో రీమేక్ చేస్తే డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2 తీయాలని ఆర్జె బాలాజీకి ఆఫర్ వచ్చింది. అప్పటికే సూర్యకు కమిట్ మెంట్ ఇచ్చిన ఇతను దానికి నో చెప్పాల్సి వచ్చింది.
అది మాత్రమే కాదు నయన్, అమ్మోరు తల్లి తీసిన నిర్మాతలతో బాలాజీకి విభేదాలు రావడం వల్లే సీక్వెల్ వదులుకున్నాడని చెన్నై మీడియాలో వినిపించింది. బాలాజీ నో చెప్పాక అది సుందర్ సి టేకప్ చేశారు. వంద కోట్ల బడ్జెట్ తో నయనతారతోనే తీస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే నయనతార మూవీని వద్దనుకోవడం బాలాజీకి చాలా పెద్ద మేలు చేసింది. 2026లో రెండు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చిన తొలి తమిళ దర్శకుడిగా ఘనత సాధించేశారు.
కంటెంట్, టేకింగ్ పరంగా బాలాజీ మీద విమర్శలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇతని డిమాండ్ అమాంతం పైకి వెళ్ళిపోయింది. ఎవరూ ఊహించని ఒక పెద్ద స్టార్ తో త్వరలో కాంబినేషన్ ఉండొచ్చనే తరహాలో చెన్నై లీకులు ఊరిస్తున్నాయి. రిలీజ్ రోజు కన్నీళ్లు పెట్టుకున్న బాలాజీ ఇప్పుడు ఆనందంతో గెంతులు వేస్తున్నారు. నెగటివిటీ వచ్చిన మూవీకి అనూహ్యంగా ఇంత వసూళ్లు కురవడమంటే అదో అద్భుతమేగా.
This post was last modified on May 27, 2026 2:33 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…