Movie News

శాటిలైట్ దేవరకు మోక్షం దొరకనుందా ?

థియేటర్ రిలీజై రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటిదాకా దేవర సినిమా శాటిలైట్ ప్రసారానికి నోచుకోలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే కానీ ఇది అక్షరాలా నిజం. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మూవీ ఇంత కాలం సోల్డ్ అవుట్ కాకుండా ఉండదు. అయితే విడుదలకు ముందు నిర్మాతలు ఆశించిన మొత్తానికి ఆఫర్లకు మధ్య వ్యత్యాసం రావడం వల్లే ఆగిపోయిందని, లేదంటే అప్పుడే జరిగిపోయేదని అంతర్గత వర్గాల మాట.

స్టార్ మా, జీ తెలుగు, జెమిని గట్టిగానే ట్రై చేశాయి కానీ ధర దగ్గర ఏదో తిరకాసు వచ్చి ఆగిపోయారని వినికిడి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర హక్కులు సొంతం చేసుకునే దిశగా ఈటీవీ ఛానల్ గట్టిగా అడుగులు వేస్తోందని తెలిసింది. భారీ రేట్ ఆఫర్ చేయకపోయినా ఉన్నంతలో ఒక డీసెంట్ మొత్తాన్ని ప్రతిపాదనగా పెట్టినట్టు సమాచారం. మరి నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరలవుతోంది.

ఈటీవీ అంటే ట్రెండింగ్ ఛానెల్ కాదని అభిమానుల అభిప్రాయం. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు గమనించాలి. జూనియర్ ఎన్టీఆర్ ని సోలో హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసింది రామోజీరావే. ఒక దశ వరకు తారక్ సినిమాలు కొంటూ వచ్చారు. ఇప్పటికీ సింహాద్రి చూడాలంటే ఈటీవీలో టెలికాస్ట్ అయినప్పుడే ఛాన్స్ ఉంటుంది. లేదంటే తక్కువ క్వాలిటీతో యూట్యూబ్ లో చూసుకోవాలి. అల్లరి రాముడు కూడా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ తర్వాత జూనియర్ సినిమాలు కొనలేదు.

ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఉంది కాబట్టి దానికి ధీటైన శాటిలైట్ ఛానల్ లో దేవర రావాలని ఫ్యాన్స్ కోరిక. ఈటీవీని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. ఈ మధ్య ఓటిటిలోనే కాదు ప్రొడక్షన్ లో కూడా దూకుడు పెంచారు. కాకపోతే కొత్త సినిమాలు కొనే విషయంలో వెనుకబడి మాట కాదనలేం లేదు ఇకపై ఇదే తరహా క్రేజీ మూవీస్ సొంతం చేసుకుంటే టిఆర్పి రేటింగ్స్ కూడా పెరుగుతాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వీకెండ్ లో రావొచ్చని డిజిటల్ వర్గాల కథనం.

This post was last modified on May 26, 2026 12:59 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

13 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago