కొందరు అధికారుల అత్యుత్సాహం ఉద్యోగుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి వాటిపై ఆయా ప్రాంతాలకు చెందిన పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఒకింత దృష్టి సారించి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అంతేకాకుండా అనవసరంగా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆయా శాఖల అధికారులను కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉందన్న మాటా వినిపిస్తోంది.
అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే… తెలంగాణ ఆర్టీసీలో అశోక్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జగిత్యాల పరిధిలో ఉద్యోగ నిర్వహణలో ఉన్న అశోక్… రోజూ మాదిరే బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వారు ఆందోళన చేస్తుండగా… బస్సును అక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అశోక్ మాట కలిపారట.
పెట్రోల్, డీజిల్ ధరలు అలా పక్కనపెడితే… రైతులు పండించిన ధాన్యాన్ని కొనేలా చూడాలంటూ ఈ సందర్భంగా అశోక్ తన గ్రామస్తుడితో చెప్పారట. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముడుబోక రైతులు నానా పాట్లు పడుతున్నారని, పంట ఉత్పత్తులు కొంటేనే కదా… అన్నదాతల ఇళ్లు కూడా నడిచేది అని ఆయన అన్నారట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో, ఏమో తెలియదు గానీ… అశోక్ పై చర్యలకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉపక్రమించేశారు. అశోక్ ను విధుల్లో నుంచి తప్పించిన ఆర్ఎం…అశోక్ కు పనేమీ ఇవ్వవద్దని తన పరిధిలోని ఐదు ఆర్టీసీ డిపోలకు ఆర్ ఎం ఆదేశాలు జారీ చేశారట.
ఈ విషయం తెలిసిన అశోక్ లబోదిబోమంటున్నారట. పెట్రోల్, డీజీల్ ధరల గురించి తానేమీ మాట్లాడలేదని, రైతుల ఇబ్బందుల గురించి తాను మాట్లాడానని, అది కూడా తన గ్రామానికి చెందిన వ్యక్తి కనిపిస్తేనే ఏదో అలా మాట కలిపానని అశోక్ వాపోతున్నారు. ఈ మాత్రం దానికే తన ఉద్యోగాన్ని తొలగించే దిశగా ఆర్ ఎం చర్యలు తీసుకోవడం తన జీవనాధారాన్ని తీసివేయడమేని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడ్డానికి ఇది చిన్న విషయమే అయినా…ఆర్ఎం చేసిన పని అశోక్ కుటుంబం మొత్తంపై పెను ప్రభావాన్ని చూపడం ఖాయమే కదా. అందుకే ఈ తరహా ఘటనలపై సీఎం రేవంత్ ఓ కన్నేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
This post was last modified on May 26, 2026 6:42 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…