Movie News

తీన్‌మార్‌కూ డ‌బ్బులు పోగొట్టుకోని బండ్ల గ‌ణేష్‌

ఒక‌ప్ప‌టితో పోలిస్తే సినిమాల స‌క్సెస్ రేట్ ఎంత దారుణంగా ప‌డిపోయిందో, సినీ నిర్మాణం ఎంత జూదంలా మారిపోయిందో.. నిర్మాతల ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారిందో తెలిసిందే. నిర్మాత‌కు లాభాలు తెచ్చిపెట్టే సినిమాల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ ఏమో బాగా పెరిగిపోయింది. బ‌డ్జెట్ రిక‌వ‌రీ అన్న‌ది చాలా క‌ష్టంగా మారింది.

అందుకే తాను ప్రొడ‌క్ష‌న్‌కు దూరంగా ఉన్న‌ట్లు చెబుతున్నాడు బండ్ల గ‌ణేష్‌. ఒక ద‌శ‌లో వ‌రుస‌గా పెద్ద పెద్ద సినిమాలు నిర్మించిన గ‌ణేష్‌.. ఉన్న‌ట్లుండి ప్రొడ‌క్ష‌న్ వ‌దిలేశాడు. టెంప‌ర్ లాంటి హిట్ ఇచ్చి సినీ నిర్మాణానికి దూరం అయ్యాడు. మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఒక సినిమా చేసి, బేన‌ర్ మూసేయాల‌ని బండ్ల కోరుకుంటున్నాడు కానీ.. ఇప్పుడున్న బిజీలో ప‌వ‌ర్ స్టార్ ఎప్పుడు అవ‌కాశ‌మిస్తాడో తెలియ‌దు. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాను నిర్మించిన ఏ సినిమాకూ తాను ఒక్క రూపాయి కూడా న‌ష్ట‌పోలేద‌ని బండ్ల గణేష్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం.

నిర్మాత‌గా గ‌ణేష్ తొలి సినిమా ఆంజ‌నేయులు ఫ్లాప్ అయింది. రెండో చిత్రం తీన్ మార్ సైతం ఫ్లాపే. కానీ కంటెంట్, క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇవి ఫ్లాపులే కానీ.. తాను మాత్రం నిర్మాత‌గా న‌ష్ట‌పోలేద‌ని బండ్ల తెలిపాడు. ముఖ్యంగా తీన్ మార్ గురించి అడిగితే.. ఆ సినిమాకు కూడా తాను లాభం అందుకున్న‌ట్లు వెల్ల‌డించాడు.

డ‌బ్బులు పోగొట్టుకుని సినిమాలు నిర్మించ‌డానికి తానేమైనా పిచ్చివాడినా అని బండ్ల ప్ర‌శ్నించాడు. వ్యాపారం చేసి ఎవ‌రైనా డ‌బ్బులు పోగొట్టుకుంటాడా అని బండ్ల అన్నాడు. మ‌రి ఇప్పుడున్న నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంటి అని అడిగితే.. వాళ్లు త‌న కంటే తెలివైన వాళ్ల‌ని.. లాభాలు వ‌స్తున్నాయి కాబ‌ట్టే సినిమాలు తీస్తున్నారేమో అని బండ్ల అన్నాడు.

ఇలా వ్యంగ్యంంగా మాట్లాడుతూనే.. ప్ర‌స్తుతం సినిమాల నిర్మాణం ఎంత దారుణంగా మారిందో బండ్ల వెల్లడించాడు. ప్రొడ‌క్ష‌న్ పూర్తిగా చెయ్యి దాటిపోయింద‌ని, ఇప్పుడు ఎవ‌రికీ సలహాలు కూడా ఇవ్వలేని ప‌రిస్థితి ఉంద‌ని బండ్ల చెప్పాడు. సినీ నిర్మాణం 4వ ద‌శ క్యాన్స‌ర్ స్థాయిలో ఉంద‌ని అత‌న‌న్నాడు.. ఒక స‌న్నివేశంలో లక్ష రూపాయల పెన్ను వాడదాం, రిచ్‌గా ఉంటుంద‌ని అంటార‌ని.

కానీ ఆ పెన్ను వల్ల సినిమాలు ఆడేస్తాయా అని బండ్ల ప్ర‌శ్నించాడు. ఒకప్పుడు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ద‌గ్గ‌ర మేకులు కూడా తూకం వేసుకునేవాళ్లమ‌ని. నిర్మాత‌కు ప్రతి రూపాయి లెక్క ఉండేద‌ని.. ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ పూర్తిగా అదుపు త‌ప్పింద‌ని, ఇలాంటి స‌మ‌యంలో సినిమాలు తీయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని బండ్ల అభిప్రాయ‌ప‌డ్డాడు.

This post was last modified on May 26, 2026 6:33 am

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

36 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

50 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago