Movie News

బుమ్రా టాపిక్ వదిలేయడం బెటర్

నిన్న భోపాల్ లో జరిగిన పెద్ది సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ క్రికెటర్ బుమ్రాని ఉద్దేశించి ఫుట్ బాల్ ప్లేయరని సంబోధించడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీసింది. బుమ్రాకు ఇంకోవిధంగా ఆ ఆటతో కనెక్షన్ ఉందని మెగా ఫ్యాన్స్ సమర్ధించే ప్రయత్నం చేసినప్పటికీ అదంతా వృథా ప్రయాసే. యాంటీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని శుభ్రంగా వాడేసుకుని వీడియోలు గట్రా ఎడిటింగ్ చేసేసి ఎక్స్, ఇన్స్ టాలో పెట్టేసి లక్షలల్లో వ్యూస్ తెచ్చేసుకుంటున్నారు.

కానీ ఇక్కడ ప్రాథమికంగా గుర్తించాల్సిన విషయం ఒకటుంది. భోపాల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అక్కడ హైలైట్ అయినవి ఎన్నో ఉన్నాయి. రెహమాన్ కన్సర్ట్, రవి కిషన్ స్పీచ్, దివ్యెందు ట్విస్ట్, జాన్వీ ప్రసంగం, వేళల్లో జన సందోహం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. ఇంత హడావిడిలో చరణ్ టంగ్ స్లిప్ అయిపోయి ఫుట్ బాల్ దగ్గర దొరికేసాడు. అంత మాత్రాన దాన్నే పదే పదే పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇటు మెగాభిమానులు కూడా ట్రోల్స్ కి సమాధానం చెప్పడం వల్ల వాటికి మరింత రీచ్ తెచ్చినట్టు అవుతుంది తప్పించి పాజిటివ్ అంశాలు బయటికి వెళ్లకుండా ఆగిపోతాయి. అసలే ట్రైలర్ తర్వాత పెద్ది మీద ఉన్న అంచనాలు తూకం తప్పాయి. వాటిని రిపేర్ చేయడానికి భోపాల్ వేడుకే మంచి అవకాశం. హైదరాబాద్ లో ఇంకో ఈవెంట్ చేసినా భోపాల్ అంత పెద్ద స్థాయిలో ఉంటుందో లేదో చెప్పలేం కాబట్టి చేతిలో ఉన్నది వాడుకోవడం ఉత్తమ నిర్ణయం.

బుమ్రాకు సారీ చెబుతూ రామ్ చరణ్ ట్వీట్ వేయడంతో అక్కడితో దానికి ముగింపు దక్కిందని చెప్పాలి. ఇది కాకుండా భోపాల్ ని పొరపాటున బీహార్ అని సంబోధించిన చరణ్ దాన్ని తర్వాత సరిచేసుకోవడం, జాన్వీ కపూర్ పక్కన కూచుని పొరపాటు గురించి చెప్పడం ఇవన్నీ వీడియోల రూపంలో బయటికి వచ్చాయి. ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న పెద్ది కోసం మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ సినిమాల కరువు అలా ఉంది మరి.

This post was last modified on May 24, 2026 11:51 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago