హాట్ హెబ్బా.. ఇలా ఫిక్స‌యిపోవ‌చ్చు

హిందీలో మ‌లైకా అరోరా.. తెలుగులో హంసా నందిని లాంటి వాళ్లు కేవ‌లం ఐటెం పాట‌ల‌తోనే పాపుల‌ర్ అయ్యారు. వాళ్లు హీరోయిన్లుగా ఎవ‌రికీ గుర్తుండరు. ఐటెం భామ‌లుగానే పేరు సంపాదించారు. ఐతే ఇంత‌కుముందు ఐటెం సాంగ్స్‌ను వేరుగా చూసేవాళ్లు. వాటిలో హీరోయిన్లు క‌నిపించేవాళ్లు కాదు. ఆ త‌ర‌హా పాట‌ల్లో క‌నిపించే వాళ్ల స్థాయి కొంచెం త‌క్కువ‌గా ఉండేది.

కానీ గ‌త కొన్నేళ్ల‌లో శ్రుతి హాస‌న్, త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి ఆ త‌ర‌హా పాట‌ల స్థాయి పెంచారు. ఆ నేప‌థ్యంలో వేరే హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయ‌డానికి వెనుకాడ‌ట్లేదు. ఈ పాట‌ల్లో అందాలు ఆర‌బోస్తూ మాస్ స్టెప్పులు వేస్తే వ‌చ్చే గుర్తింపు, క్రేజే వేరు. ఇప్పుడు హెబ్బా ప‌టేల్ ఇదే ప‌ని చేసింది. రామ్ సినిమా రెడ్ కోసం ఆమె చేసిన దించక్ పాట ఇన్‌స్టంట్ హిట్ట‌యిపోయింది.

ఇంకో రెండు వారాల్లో సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో దించ‌క్ సాంగ్ లిరిక‌ల్ వీడియో వ‌దిలారు. అందులో కొన్ని విజువ‌ల్స్ కూడా చూపించారు. మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన జానీ మాస్ట‌ర్.. మాంచి నాటు స్టెప్పులేయించాడు. అవి చూస్తే థియేట‌ర్ల‌లో మాస్ ప్రేక్ష‌కులు కుదురుగా ఉండ‌టం క‌ష్ట‌మే అనిపిస్తోంది.

ఇక తాను న‌టిస్తున్న‌ సినిమాల్లో రోజు రోజుకూ బోల్డ్ నెస్ పెంచేస్తున్న హెబ్బా ఈ పాట‌లో మ‌రింత‌గా అందాలు ఆర‌బోసింది. ఆమె లుక్స్, డ్రెస్సింగ్, హావ‌భావాలు, స్టెప్పులు అన్నీ కూడా చాలా హాట్‌గా ఉండి కుర్రాళ్ల గుండెల్ని ల‌య త‌ప్పించేలా ఉన్నాయి. సినిమాలో క‌చ్చితంగా ఈ పాట హైలైట్ అవుతుంద‌నిపిస్తోంది. హీరోయిన్‌గా కెరీర్‌పై పెద్ద‌గా ఆశ‌ల్లేని హెబ్బా.. ఇక‌పై భీష్‌మ త‌ర‌హా హాట్ క్యామియోలు.. ఈ త‌ర‌హా ఐటెం సాంగ్స్ చేస్తూ న‌డిపించేయొచ్చు అనిపిస్తోంది చూస్తుంటే.