తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తే.. ప్రి రిలీజ్ హైప్ బాగుంటే.. టాక్ బాలేకున్నా ఆ చిత్రానికి ఎంతో మంచి ఫలితం వస్తుందనడానికి ఇది రుజువు. ఈ గురువారం రిలీజైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమా ‘దృశ్యం-3’ టాక్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని పంచిన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలకు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు.
ఇది మోహన్ లాల్ సొంత నిర్మాణ సంస్థ అనదగ్గ ఆశీర్వాద్ సినిమాస్ బేనర్ మీద తెరకెక్కింది. జీతు ఎప్పుడూ అవసరం లేని హంగులకు పోకుండా, పరిమిత బడ్జెట్లో కథా బలంతో సినిమాలు తీస్తుంటాడు. ‘దృశ్యం-3’ని కూడా రెండు మూడు నెలల్లో పూర్తి చేసేశాడు. భారీ లొకేషన్లేమీ ఉండవు. దీంతో కేవలం రూ.16 కోట్లలోనే సినిమా పూర్తయింది.
మోహన్ లాల్‌కు లాభాల్లో వాటా ఇస్తారు కాబట్టి పారితోషకం తీసుకోలేదు. జీతు సైతం అంతే. కాబట్టే పెద్ద స్టార్ సినిమా అయినా.. తక్కువ బడ్జెట్లో అయిపోయింది.
ఈ సినిమా ప్రోమోలు అంత గొప్పగా లేకపోయినా సరే.. సీక్వెల్ హైప్ జనాలను థియేటర్లకు రప్పించింది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి అంత గొప్ప టాకేమీ రాలేదు. రివ్యూలు కూడా అలాగే వచ్చాయి.
దృశ్యం, దృశ్యం-2 చిత్రాలకు దరిదాపుల్లో కూడా లేదన్నది మెజారిటీ అభిప్రాయం. కానీ ఇవేవీ థియేటర్లకు జనాలు రాకుండా ఆపలేకపోయాయి. ఈ చిత్రం ఆల్రెడీ 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వీకెండ్ అయ్యేసరికి వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించబోతోంది దృశ్యం-3. కేరళలో ఈ సినిమా రికార్డులు కూడా బద్దలు కొడుతోంది.
మోహన్ లాల్ సినిమానే అయిన ‘ఎల్-2 ఎంపురాన్’ పేరిట ఉన్న ఓపెనింగ్ రికార్డులను ఈ సినిమా అధిగమించింది. ఈ సినిమా బడ్జెట్ అంతా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికవర్ అయిపోవడం విశేషం. తర్వాత వచ్చేదంతా లాభం అన్నట్లే.
మలయాళంలో సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి ఫుల్ రన్లో ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు. ఆ రికార్డు కూడా మోహన్ లాల్ సినిమా ‘తుడరుం’ పేరిటే ఉంది. డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాతోనూ రికార్డులు బద్దలు కొట్టడం మోహన్ లాల్‌కే సాధ్యం అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
This post was last modified on May 23, 2026 2:57 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…