ఇక సందేహాలేమీ లేనట్లే. బాలీవుడ్ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకోబోతున్నట్లే. దాదాపు రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నప్పటికీ.. తమ ప్రేమ గురించి ఇప్పటిదాకా ఈ జంట ఓపెన్‌గా ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్.. ఆలియాతో ప్రేమలో ఉన్న సంగతి నిర్ధరించాడు. అంతే కాదు.. కరోనా-లాక్ డౌన్ లేకుంటే తామిద్దరం ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకునే వాళ్లమని కూడా అన్నాడు. అతడి మాటల్ని బట్టి చూస్తే 2021లో వీరి పెళ్లి ఖాయమే అనుకోవచ్చు.
కానీ అంతకంటే ముందు వీళ్లిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. రణబీర్, అతడి తల్లి నీతూ కపూర్, ఆలియా కలిసి ఎయిర్ పోర్టులో ఉన్న ఫొటో ఒకటి పెట్టి.. నిశ్చితార్థం కోసం వీళ్లంతా కలిసి జైపూర్‌కు చేరుకున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వడ్డిస్తోంది.
జైపూర్‌లోని రాంథంబోర్ పార్క్‌లో రణబీర్, ఆలియా నిశ్చితార్థం జరగబోతోందని.. ప్రియాంక చోప్రా పెళ్లి జరిగిన చోటే వీరి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారని.. ఈ సెలబ్రేటెడ్ కపుల్ ఇలా గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని.. మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ వాస్తవం ఏంటంటే.. కొత్త సంవత్సర వేడుకల కోసమే రణబీర్, ఆలియా, నీతూ తదితరులు జైపూర్‌కు వెళ్లారట. అంతకుమించి ఏమీ లేదట. నిశ్చితార్థం ఇప్పుడేమీ జరగట్లేదని.. కొత్త ఏడాదిలో అందరికీ చెప్పే ఘనంగా ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకోబోతున్నారని కపూర్ కుటుంబ వర్గాలు తెలిపాయి.
రిషి కపూర్ సోదరుడు, కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ స్వయంగా ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. రణబీర్-ఆలియాల ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లయితే అక్కడ కచ్చితంగా తమ కుటుంబం కూడా ఉంటుందని.. తాము జైపూర్ వెళ్లట్లేదంటే నిశ్చితార్థం ఏమీ జరగట్లేదని అర్థం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ ఎంగేజ్మెంట్ వార్తలకు తెరపడింది. ప్రస్తుతం రణబీర్-ఆలియా కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు. ఆలియా దీంతో పాటే ‘ఆర్ఆర్ఆర్’లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు రెండూ పూర్తయ్యాకే ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
This post was last modified on December 31, 2020 10:20 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…