Movie News

మాట తప్పనున్న రెండో దేవర ?

మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ గ్లిమ్ప్స్ వచ్చి అభిమానులను ఫుల్ హ్యాపీ చేసింది. సోషల్ మీడియా స్పందన ఎలా ఉన్నా కెరీర్ లోనే అత్యంత భారీ యాక్షన్ గ్రాండియర్ లో తమ హీరోని చూడబోతున్నామన్న ఆనందం వాళ్లను ఉక్కిరిబిక్కిరయ్యేంత సంతోషాన్ని మిగిల్చింది. వచ్చే ఏడాది కేవలం ఆరు నెలల గ్యాప్ లో రెండు భాగాలు రిలీజ్ అవుతాయనే లీక్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మరింత పెంచింది. సరే ఇదంతా సంతోషపడాల్సిన విషయమే.

కానీ 2025 తారక్ పుట్టినరోజుకి దేవర 2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈసారి మాత్రం కేవలం శుభాకాంక్షలతో సరిపెట్టింది. అంటే దేవర 2 లేదనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎందుకంటే దర్శకుడు కొరటాల శివ అటు బాలకృష్ణ ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. దానికో ఆరేడు నెలలు కేటాయించబోతున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సెట్స్ లో అడుగు పెట్టాల్సి ఉంటుంది.

అంటే ఇంకో రెండేళ్లకు పైగా తారక్ డైరీ ఖాళీగా ఉండదు. బాలకృష్ణ సినిమా పూర్తి చేసుకున్నాక కొరటాల శివ అంత గ్యాప్ ఖాళీగా ఉండటం కష్టం. ఇప్పటికే ఏడాదిన్నర వెయిటింగ్ లోనే గడిచిపోయింది. సో దేవర 2 రూపొందే అవకాశం మెల్లగా సన్నగిల్లడంతో ఆ ఆలోచన మానుకున్నారేమో అనే సందేహం కలగడం సహజం. మొన్న బర్త్ డే రోజు త్వరలో ఉంటుందనో లేదా దేవర 2 ఆగమనం జరిగి తీరుతుందనో ఒక మాట చెప్పి ఉంటే ఈ డిస్కషన్ జరిగేది కాదు.

ఏది ఏమైనా ఏదో ఒక సందర్భంలో కొరటాల శివ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తే బెటర్. దేవర భారీ విజయం అందుకుంది కానీ మరీ కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో ఫ్రాంచైజ్ హైప్ రాలేదన్నది వాస్తవం. ఒకవేళ అలా జరిగి ఉంటే త్రివిక్రమ్ కన్నా ముందు దేవర 2నే సెట్స్ పైకి వెళ్ళేదేమో. దీనికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి. దేవరలో నటించిన జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు బయట పెద్దగా దేవర 2 ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడటం గమించాల్సిన విషయం.

This post was last modified on May 23, 2026 9:41 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

13 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

1 hour ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

6 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago