ప్యారడైజ్ అన్నీ గమనిస్తోంది

ఈ ఏడాది భారీ అంచనాలు మోస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ చాలా కీలకం. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ రా యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు విలన్ గా నటించడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆగస్ట్ 21 విడుదలలో ఎలాంటి మార్పు లేదని టీమ్ స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్న నేపథ్యంలో అభిమానులు దానికి తగ్గట్టు రెడీ అయిపోవచ్చు. అయితే కొన్ని తాజా పరిణామాలు ప్యారడైజ్ టీమ్ ని అలెర్ట్ చేశాయి.

ఇటీవలే పెద్ది ట్రైలర్ రాకముందు దాని మీద ఏ స్థాయిలో అంచనాలు ఉండేవో అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా దానికి మిక్స్డ్ టాక్ రావడం ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేసింది. అసలు సినిమా బాగుండొచ్చు కానీ ముందైతే కీలకమైన ఇంప్రెషన్ కొంచెం తగ్గిందనే బాధ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్రాగన్ గ్లిమ్ప్స్ కి కూడా ఈ సమస్య వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ లుక్ తో పాటు సలార్ కెజిఎఫ్ పోలిన బ్యాక్ డ్రాప్ తదితర అంశాలు ఎక్స్, ఇన్స్ టాలో చర్చకు దారి తీశాయి.

ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న ప్యారడైజ్ బృందం అవి తమకు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చింది ఆయా షేర్ పాట ఒక్కటే. అది చార్ట్ బస్టర్ అయ్యింది. అలాని సంబరపడేందుకు లేదు. చికిరి చికిరి టైంలో ఉన్న ఊపుకి, పెద్ది ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచువేషన్ కి తేడా ఉందిగా. సో ఇక పై వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మన ఆడియన్స్ తో పాటు నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవాలి.

ది ప్యారడైజ్ కి అనిరుద్ రవిచందర్ మిగిలిన సాంగ్స్ కూడా ఇదే స్థాయిలో ఇచ్చి ఉంటాడనే నమ్మకం మూవీ లవర్స్ లో ఉంది. ఇక టీజర్ రావాలి. దాని తర్వాత ట్రైలర్. అటుపై ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు వగైరా చాలానే ఉంటాయి. ఆడియన్స్ లో ప్రాజెక్టు మీద ఏ స్థాయిలో హైప్ ఉందో దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా పబ్లిసిటీ మెటీరియల్ చేసుకోవాలి తప్ప ఇంకే రకమైన క్యాలికులేషన్లు వేసినా మిస్ ఫైర్ అయ్యే రిస్క్ ఉంది. అందుకే ఇంత లోతుగా వెళ్లాల్సి వస్తోంది.