అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అతను రణబీర్ కపూర్‌తో తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఇంత త్వరగా సందీప్ అంత పెద్ద బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేస్తానని ఊహించి ఉండడు. పెద్దగా ఇమేజ్ లేని విజయ్ దేవరకొండ అనే కుర్రాడిని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో, ఎన్నో ఇబ్బందుల మధ్య అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్‌తో అక్కడా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. తర్వాతి సినిమా ఖరారవడంలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు అది ఓకే అయింది.
సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్న టీ సిరీస్ అధికారిక అప్ డేట్ ద్వారా ఈ సినిమాను వార్తల్లోకి తీసుకురాబోతోంది. డిసెంబరు 31న అర్ధరాత్రి సందీప్-రణబీర్ సినిమా సర్ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఆ అప్ డేట్ ఏ రూపంలో ఉంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిమల్ అనే టైటల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలవుతుందని రణబీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on December 31, 2020 7:16 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…