Political News

దానం ఆశించిందేంటి? జ‌రిగిందేంటి?

తెలంగాణ‌లోని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ప‌ద‌విని కోల్పోయారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 మేర‌కు ఆయ‌న ప‌ద‌విపై వేటు వేస్తూ.. సాక్షాత్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం .. కేవలం మూడేళ్ల‌లోనే ఈ ప‌ద‌వికి దూర‌మ‌య్యారు. అయితే.. అస‌లు ఆయ‌న పార్టీ ఎందుకు మారిన‌ట్టు? ఏం ఆశించారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ఊర‌క‌రారు మ‌హానుభావులు.. అన్న‌ట్టుగా దానం మాత్రం ఊరికేనే బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని అంటున్నారు.

బీఆర్ ఎస్‌లో చేరిన‌ప్పుడే..

గ‌తంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న దానం.. అప్ప‌టి సీనియ‌ర్ నాయ‌కుడు ప‌బ్బ‌తి రెడ్డి జ‌నార్ద‌న్‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా ఉన్నారు. అనంత‌ర కాలంలో జ‌నార్ద‌న్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత‌.. దానం.. ఖైర‌తాబాద్ సీటు నుంచి కాంగ్రెస్ టికెట్‌పైనే విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలుపు గుర్రం ఎక్కిన దానం.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2018 ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నిక‌లు వ‌రుస‌గా వ‌చ్చిన 2023 ఎన్నిక‌ల్లోనూ అదే పార్టీ గుర్తుపై పోటీ చేసి విజ‌యం సాధించారు.

మంత్రి ప‌ద‌వి కోసమే!

బీఆర్ ఎస్ పార్టీలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న దానం.. మంత్రిపీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. కేటీఆర్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఆశించిన మేర‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌తోనే 2023లో విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. రేవంత్ రెడ్డితో మాట్లాడుకుని.. పార్టీ మారారు. అయితే.. దానం అనుకున్న‌ట్టుగా.. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు పార్టీ త‌ర‌ఫున పార్ల‌మెంటు టికెట్ ఇప్పించారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో దానం ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఇక, జంపింగుల విషయంలో బీఆర్‌ఎస్‌ సైలెంట్‌గా ఉంటుందని వారు భావించినా.. కేసీఆర్‌ అలా లేకపోవడం, జంపింగులకు షాక్‌ ఇచ్చేలా బీఆర్‌ఎస్‌ నేతలు అడుగడుగునా పోరాటం చేయడంతో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. మొత్తంగా.. దానం ఆశించిన మంత్రి పదవి దక్కకపోగా, ఇప్పుడు ఆరేళ్లపాటు లేదా కనీసం నాలుగేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది.

This post was last modified on September 19, 2026 5:26 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

9 minutes ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

25 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago