గత కొన్నేళ్లలో తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేశాడు. ఆ మూవీ అటు తమిళంలో, ఇటు తెలుగులో ఘనవిజయం సాధించింది. ఓటీటీలోకి వచ్చాక మిగతా భాషల్లోనూ ఆదరణ పొందింది. దీని రీచ్ మరింత పెరిగింది. ఈ సినిమా స్క్రీన్ ప్లేను ఫిలిం స్కూల్స్‌లో పాఠ్యాంశంగా చేర్చేంత గొప్పగా ఉంటుంది.
అందుకే ఇప్పుడీ సినిమా హాలీవుడ్లో కూడా రీమేక్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత సుధన్ ఇటీవలే వెల్లడించాడు కూడా. ‘మహారాజ’ హాలీవుడ్లోకి వెళ్తున్న విషయం నిజమేనని విజయ్ సేతుపతి కూడా ధ్రువీకరించాడు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా అయిపోయినట్లు చెప్పాడు. నిర్మాత ఈ విషయం చెప్పగానే తనకు కూడా హాలీవుడ్ రీమేక్‌లో ఛాన్స్ ఉంటుందా అని అడిగినట్లు సేతుపతి చెప్పాడు. కానీ ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెక్‌కెనగీ నటిస్తున్నట్లు నిర్మాత చెప్పాడని సేతుపతి తెలిపాడు.
ఐతే హీరో కాకపోయినా.. అందులో ఏదైనా ఒక పాత్ర ఉన్నా ఓకే అని.. పారితోషకం కూడా తీసుకోకుండా ఉచితంగా నటించడానికి సిద్ధమని చెప్పినట్లు రవితేజ చెప్పాడు. హాలీవుడ్లో నటించాలన్నది తన కోరిక అని.. అది నెరవేరుతుందో లేదో కానీ, తాను నటించిన సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుండడం చాలా సంతోషమని సేతుపతి వ్యాఖ్యానించాడు.
మరోవైపు ‘మహారాజ’కు సీక్వెల్ చేయబోతున్నట్లు విజయ్ సేతుపతి ఈ సందర్భంగా కన్ఫమ్ చేశాడు. నిథిలన్ గొప్ప దర్శకుడని.. తనతో మళ్లీ పని చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ‘మహారాజ’ సినిమా మీద రిలీజ్‌కు ముందు చాలామంది నమ్మకం లేదని.. కానీ ఇప్పుడది హాలీవుడ్లో కూడా రీమేక్ అవుతోందని సేతుపతి వ్యాఖ్యానించాడు.
This post was last modified on September 19, 2026 8:46 pm
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…