రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘RAPO23’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్క్రిప్ట్ లాక్ అయింది, కాస్టింగ్ మొదలైంది. విలన్‌గా ఎస్‌జె సూర్య పేరు, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. అయితే అసలు సీనియర్ నటులు రామ్‌ని దర్శకుడిగా నమ్మి ఓకే చెబుతున్నారా? లేక హీరోగా ఆయనకు ఉన్న క్రేజ్ చూసి వస్తున్నారా? లేక కంటెంట్‌లో బలం ఉంది కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా? అనే ప్రశ్నలు హైలెట్ అవుతున్నాయి.
ఇక్కడ మొదట అర్థం చేసుకోవాల్సింది కొత్త దర్శకుడికి నటులు ఓకే చెప్పే లెక్క. డెబ్యూ డైరెక్టర్ అయితే కథలో దమ్ము, పాత్రలో డెప్త్ ఉండాలి. లేదంటే బిజీగా ఉన్న నటులు రిస్క్ తీసుకోరు. ముఖ్యంగా ఎస్‌జె సూర్య లాంటి వాళ్లు. ఆయన స్వయంగా దర్శకుడు, స్క్రిప్ట్ జడ్జ్ చేయగలడు. ఫహద్ ఫాజిల్‌ని కూడా మొదట అనుకోవడం చూస్తే రామ్ టీమ్ కేవలం పేరు కోసం కాకుండా పాత్రకు సరిపోయే నటుడి కోసం వెతుకుతోంది అని తెలుస్తోంది. అంటే కంటెంట్ మీద నమ్మకం లేకపోతే ఈ స్థాయి నటుల దగ్గరకు వెళ్లరు.
అలాగే రామ్ హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త పడతాడు. తన సినిమాలో ఏ పాత్రా తేలికగా ఉండకూడదు అని ఏ హీరో అయినా అనుకుంటాడు. ఎందుకంటే సినిమా ఫలితం నేరుగా తన మీదే పడుతుంది. దర్శకుడిగా ఫెయిల్ అయితే హీరో ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అందుకే స్క్రిప్ట్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు పక్కాగా ప్లాన్ చేస్తాడు. నటులకు కూడా ఈ విషయం తెలుసు. ‘ఇతను తన సినిమా కోసం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు’ అనే నమ్మకం వాళ్లకు వస్తుంది. అది ఒకరకంగా అడ్వాంటేజ్.
మరోవైపు రామ్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎనర్జీ, డాన్స్, యాక్షన్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో పాట రాసి పాడి తనలోని రైటింగ్ సైడ్ కూడా చూపించాడు. అయినా కేవలం క్రేజ్ ఉంటే చాలదు. సూర్య, ఫహద్ లాంటి వాళ్లు డేట్స్ ఇవ్వాలంటే కథ వినాలి, తమ పాత్రలో కొత్తదనం ఉందని నమ్మాలి. పారితోషికం బేరాలు జరుగుతున్నాయి అంటేనే సీరియస్‌గా డిస్కషన్ జరుగుతోంది అని అర్థం. ఏదేమైనా క్రేజ్ డోర్ తెరుస్తుంది, కానీ కంటెంట్ లోపలికి రప్పిస్తుంది.
ముఖ్యంగా నటుడిగా, దర్శకుడిగా రెండు బాధ్యతలు అంటే రిస్క్ ఎక్కువ. ఆ విషయం రామ్‌కి తెలుసు. అందుకే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అని జానర్ ఫిక్స్ చేశాడు. ఇలాంటి కథల్లో ప్రతి క్యారెక్టర్‌కి లేయర్స్ ఉంటాయి. విలన్ పాత్ర హీరోతో సమానంగా ట్రావెల్ అవుతుంది. అందుకే సూర్య అయితే కరెక్ట్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక కొత్త దర్శకుడు ఇంత క్లారిటీతో ఉంటే నటులకు కూడా భరోసా వస్తుంది. హీరోగా రామ్‌కి ఉన్న ఇమేజ్ ఒక ప్లస్. కానీ అదొక్కటే సరిపోదు. స్క్రిప్ట్‌లో బలం కూడా ఉండాలి. ఇక దర్శకుడు రామ్ టాలెంట్ ఏమిటో తెలియాలి అంటే టీజర్ లాంటి కంటెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates