ఏడాది వెనక్కి వెళ్తే మెగా ఫ్యామిలీ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టేస్తే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు నవతరం హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇలా ఫ్యామిలీలో అందరూ ఫ్లాపుల్లోనే ఉన్న సందర్భం అరుదు. ఐతే గత ఏడాది సెప్టెంబరు నుంచి మెగా లెక్కలు మారిపోయాయి.
పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ మంచి ఫలితాన్నిందుకుని సక్సెస్ స్ట్రీక్‌కు శ్రీకారం చుట్టింది. ఇక సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో మోత మోగించేశాడు. అది రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. ‘పెద్ది’ తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్లను నమోదు చేసింది. ఈ సినిమాల గురించి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రస్తావించాడు. మెగా సక్సెస్ స్ట్రీక్ మొదలైందని.. తన స్థాయిలో ‘కొరియన్ కనకరాజు’తో ఆ స్ట్రీక్‌ను కొనసాగించే ప్రయత్నం చేస్తానని అన్నాడు. తన మాట నిజమవుతోంది.
రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచే ‘కొరియన్ కనకరాజు’ హంగామా మామూలుగా లేదు. వరుణ్ గత చిత్రాలు దారుణమైన డిజాస్టర్లు అయినా సరే.. ఈ చిత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రిమియర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఐతే ఆ షోల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. ఆ ప్రభావం సినిమాపై పెద్దగా పడలేదు. వీకెండ్లో మంచి వసూళ్లతో సాగిపోతోంది సినిమా.
ఆదివారం రన్ అయ్యేసరికి బయ్యర్ల పెట్టుబడి దాదాపుగా రికవర్ అయ్యిందని భావిస్తున్నారు. సినిమాను తక్కువ రేట్లకు అమ్మడం కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ గ్రాస్ రూ.25 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా. వీకెండ్ తర్వాత ఓ మోస్తరు వసూళ్లు సాధించినా సినిమా హిట్ స్టేటస్ అందుకోవడం పక్కా. మొత్తానికి ఈ చిత్రం వరుణ్ తేజ్‌కు అత్యావశ్యక విజయాన్ని అందించినట్లే. చెప్పినట్లే అతను మెగా సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించినట్లే. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించాయి.
This post was last modified on August 10, 2026 6:47 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…