Movie News

వకీల్ సాబ్‌.. ఫిక్సయిపోయాడా?


2021కి తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల విరామం తర్వాత రాబోతున్న సినిమా ఇది. కరోనా లేకుంటే ఈ ఏడాది వేసవిలోనే సందడి చేయాల్సిన చిత్రమిది. వైరస్ తెచ్చిన విరామం వల్ల ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యమైంది.

లాక్ డౌన్ తర్వాత కొంచెం ఆలస్యంగా సెట్స్‌లోకి అడుగు పెట్టిన పవన్.. ఇటీవలే ఈ సినిమాలో తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తి చేశాడు. వేరే పాత్రధారులతో కొన్ని సన్నివేశాలు మిగిలున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే అవి కూడా పూర్తవుతాయి. ఇంకో రెండు వారాల్లో ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. సంక్రాంతి సమయానికి సినిమా రెడీ చేయడం కష్టమని, అలాగే 50 పర్సంట్ ఆక్యుపెన్సీ ఉన్న సమయంలో సినిమాను రిలీజ్ చేస్తే నష్టమని భావించి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు.

ఫిబ్రవరి, మార్చి నెలలంటే అన్ సీజన్ కాబట్టి ‘వకీల్ సాబ్’ను అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. వేసవికి విడుదల అన్నది పక్కా. ఐతే డేట్ మాత్రమే తేలాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు ఈ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. వేసవిలో ఆలస్యం చేయకుండా.. ఆరంభంలోనే ‘వకీల్ సాబ్’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని ఆయన ఫిక్సయ్యాడట. ఏప్రిల్ 9కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

ఏప్రిల్ 30కి ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ విడుదల కావొచ్చని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ భారీ చిత్రానికి, పవన్ సినిమాకు మూడు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుని ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ సైతం వేసవి రేసులోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మే రెండో అర్ధంలో రిలీజ్‌కు ప్లాన్ చేసే అవకాశముంది.

This post was last modified on December 31, 2020 1:56 am

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

50 minutes ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

2 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

3 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

5 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

7 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

7 hours ago