తెలుగులో ఇటు ఇండస్ట్రీ.. అటు ప్రేక్షకులు.. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా.. పెద్ది. సంక్రాంతి తర్వాత వెలవెలబోతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరిలూదే సినిమా అవుతుందని ‘పెద్ది’ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో అనే కాక ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఐతే అనుకూల పరిస్థితుల మధ్య వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్ మాత్రం సరిగా లేదని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా పాటలు, ప్రోమోల వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ వచ్చింది కానీ.. రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెంచేలా టీం రిలీజ్ ముంగిట సరైన ప్రమోషన్లు చేయలేదని అభిమానులు ఫీలవుతూ వచ్చారు కొన్ని రోజుల ముందు వరకు. ఐతే విడుదలకు ముందు రెండు వారాలు ‘పవర్ ప్లే టూర్’ పేరుతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది టీం.
కానీ అంతకంటే ముందు తెలుగు రాష్ట్రాల వరకు టీం రంగంలోకి దిగడానికి ముందే కావాల్సినంత పబ్లిసిటీ జరిగిపోయింది ‘పెద్ది’ సినిమాకు. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఎంత గొడవ జరుగుతోందో తెలిసిందే. సింగిల్ స్క్రీన్లకు ఇప్పుడున్న అద్దె విధానం స్థానంలో మల్టీప్లెక్సుల తరహాలోనే పర్సంటేజీ పద్ధతిని తేవాలని ఎగ్జిబిటర్లు అల్టిమేటం విధిస్తే.. అలా కుదరదని నిర్మాతలు తేల్చారు.
ఈ నేపథ్యంలో పరస్పరం ప్రెస్ మీట్లు పెట్టి అనేక ఆరోపణలు చేశారు. ఈ గొడవకు మీడియా నుంచి బోలెండంత కవరేజీ దక్కింది. సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా దీని మీదే చర్చ నడుస్తోంది.
ఐతే ఈ గొడవలో ‘పెద్ది’ సినిమా సెంటర్ పాయింట్‌గా ఉండడం గమనార్హం. ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేసే క్రమంలోనే పర్సంటేజీ విధానాన్ని తెరపైకి తెచ్చారని నిర్మాతలు అనడం.. అదేమీ లేదని అవతలి వర్గం వాదించడం.. మీడియాలో, సోషల్ మీడియాలోనూ దీని మీద విశ్లేషణలు రావడం.. ఈ సినిమా ప్రస్తావనతోనే నెటిజన్లు కూడా పోస్టులు పెట్టడం.. ఇలా ‘పెద్ది’ సినిమా గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ సినిమాకు పైసా ఖర్చు పెట్టకుండా, చరణ్ అండ్ టీం రంగంలోకి దిగకుండానే బోలెడంత పబ్లిసిటీ వచ్చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
