Movie News

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు. అయితే ఈసారి కేవలం హీరోగా కాకుండా దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తన ఎనర్జీని సరైన రీతిలో వాడుకునే డైరెక్టర్ దొరక్కపోవడంతో తానే మెగా ఫోన్ చేపట్టాలని నిర్ణయించుకుని ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందబోయే ఈ మూవీకి సామ్ సిఎస్ సంగీతం సమకూర్చబోతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తారట. అంటే మే, డిసెంబర్ మినహాయిస్తే కేవలం ఆరు నెలల వ్యవధిలో మొత్తం పూర్తి చేసి థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. ఇదేమి అసాధ్యం కాదు. ఎందుకంటే రామ్ ఎంచుకున్నది థ్రిల్లర్ జానర్. విఎఫెక్స్ అవసరం ఉంటుంది కానీ మరీ తీవ్రంగా కాదు. విదేశాలకు వెళ్లే పనుండదు. అన్నీ సక్రమంగా టైం ప్రకారం చేసుకుంటూ వెళ్తే నవంబర్ కల్లా ఫైనల్ కాపీ సిద్ధం చేయొచ్చు.

వేగం విషయంలో అనిల్ రావిపూడిని స్ఫూర్తిగా తీసుకున్నాడు కాబోలు. గీత రచయితగా ఆల్రెడీ తన పెన్నుని పరిచయం చేసిన రామ్ ఇప్పుడు అసలైన సవాల్ ఎదురుకోబోతున్నాడు. ఎందుకంటే దీని జోలికి వెళ్లిన న్యూ జనరేషన్ హీరోలు చాలా తక్కువ. విశ్వక్ సేన్ ఒక్కడే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ప్రయత్నాలు చేస్తుంటాడు. కిరణ్ అబ్బవరం త్వరలోనే రియాలిటీ పేరుతో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పడు రామ్ ఈ లిస్టులో తోడవుతున్నాడు.

చాలా సవాళ్ళను రామ్ స్వీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరు మీడియం రేంజ్ స్టార్ డైరెక్టర్లు తనను ఇటీవల కలిసినా కథ నచ్చక నో చెప్పాడట. అలాంటప్పుడు తానే డైరెక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే బలంగా ప్రూవ్ చేసుకోవాలి. ఏ మాత్రం అటుఇటు అయినా నెగటివ్ కామెంట్స్ వస్తాయి. ఒకవేళ సక్సెస్ అయితే తన పేరు స్పెషల్ గా ఉండిపోతుంది. అందులోనూ డిఫరెంట్ జానర్ తో ట్రై చేస్తున్నాడు కాబట్టి రిజల్ట్ దక్కితే వేరేవాళ్లు కూడా ఫాలో అవుతారు.

This post was last modified on May 15, 2026 12:09 pm

Share

Recent Posts

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

2 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

3 hours ago

జ‌గ‌న్ ఆశ తీరుతుందా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులి వెందుల‌లో ఆదివారం హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

తమన్ గమనిస్తున్నాడా?

తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు తమన్. వేరే భాషల్లోనూ తరచుగా సినిమాలు చేస్తున్నాడు. తన…

3 hours ago

రాప్తాడు స్కూల్ దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు

రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు హేమంత్‌పై పోలీసులు…

4 hours ago

‘ఆదర్శ కుటుంబం’పై ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మి ఫైర్

సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో చెప్పలేం. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంటారు…

6 hours ago