Movie News

ఈసారి వేళ్ళన్నీ ఆ నిర్మాతపైనే

సింగిల్ స్క్రీన్ల‌లో అద్దె విధానాన్ని ప‌క్క‌న పెట్టి ప‌ర్సంటేజీ ఇవ్వాల్సిందే అంటూ ఎగ్జిబిట‌ర్ల సంఘం పెట్టిన ప్రెస్ మీట్‌కు బ‌దులుగా నిర్మాత‌ల త‌ర‌ఫున పెట్టిన కౌంట‌ర్ ప్రెస్ మీట్లో మాట‌ల తూటాలు పేలాయి. ముఖ్యంగా కౌంట‌ర్లు వేయ‌డంలో ప్ర‌సిద్ధి చెందిన సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నాగ‌వంశీ.. నిన్న‌టి ప్రెస్ మీట్లో నిర్మాత‌ల మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సునీల్ నారంగ్ మీద నాగ‌వంశీ గ‌ట్టిగానే టార్గెట్ చేశాడు. ఆయ‌న‌తో పాటు మైత్రి ర‌విశంక‌ర్ సైతం సునీల్ నారంగ్ మీద ఫైర్ అయ్యారు.

తెలంగాణ‌లో ఎ, బి, సి అని చూడ‌కుండా ఏ సెంట‌ర్ ప‌డితే ఆ సెంట‌ర్లో ఖాళీ స్థ‌లం దొరికితే మ‌ల్టీప్లెక్సులు క‌ట్టుకుంటూ పోతున్న పెద్ద మ‌నిషి అంటూ సునీల్ నారంగ్ మీద మండిప‌డ్డాడు నాగ‌వంశీ. 300 మల్టిప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్.. సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామ‌ని.. మల్టిప్లెక్స్‌లు కట్టేసి, సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని.. ద‌య‌చేసిన‌ ఇలాంటి కామెడీలు చేయడానికి ప్రెస్‌మీట్లు పెట్టకండి అని నాగ‌వంశీ అన్నాడు.

సునీల్ నారంగ్ చెప్పిన‌ట్లు ఒక బెనిఫిట్ షోకు 4 ల‌క్ష‌ల రెవెన్యూ వ‌స్తే 10 వేలు మాత్ర‌మే థియేట‌ర్ ఓన‌ర్‌కు ద‌క్కింద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని నాగ‌వంశీ తేల్చి చెప్పాడు. ఒక థియేటర్‌కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి లక్ష రూపాయలు రెంట్ కట్టి, పోలీస్ పర్మిషన్‌కి కూడా త‌నే డబ్బులు కట్టి షోలు వేసిన రోజులు ఉన్నాయ‌ని, పాపం ఆ ఎగ్జిబిట‌ర్‌ గారికి తెలీదేమో గానీ పదివేలకి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో వేయలేదండీ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు నాగ‌వంశీ.

నష్టాలు వస్తుంటే వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు… థియేటర్లు వదిలేసి వెళ్ళండి, వాటిని మేం చూసుకుంటాం.. అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని నాగ‌వంశీ అన్నాడు.

జనాలు థియేటర్లు కు రావట్లేదంటే అందుక్కార‌ణం నిర్మాత‌లు పెంచుకునే 50, 100 టికెట్ల రేట్లు కాద‌ని.. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువ‌గా ఉండడం అని.. ముందు వాటిని త‌గ్గించాల‌ని నాగ‌వంశీ సూచించాడు.

మ‌రోవైపు ర‌విశంక‌ర్ మాట్లాడుతూ.. ఎగ్జిబిట‌ర్ల క‌ష్టాల గురించి ఎస్వీసీ సంస్థ త‌ర‌ఫున‌ దిల్ రాజు, శిరీష్ మాట్లాడితే బాగుంటుంద‌ని.. వాళ్లు ఇండ‌స్ట్రీకి ఎంతో చేశార‌ని.. కానీ ప‌క్క‌న కూర్చున్న వ్య‌క్తికి (సునీల్ నారంగ్‌ను ఉద్దేశించి) ఏం సంబంధం ఉంది.. మ‌ల్టీప్లెక్సులు న‌డిపే ఆయ‌న‌కు సింగిల్ స్క్రీన్ల క‌ష్టాల గురించి ఏం తెలుసు అని ప్ర‌శ్నించారు.

This post was last modified on May 14, 2026 9:35 am

Share

Recent Posts

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

3 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

20 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

25 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

3 hours ago