Movie News

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి అమీర్ పేట్ దాకా, కూకట్ పల్లి నుంచి కర్మాన్ ఘాట్ దాకా ఎన్ని ఉండేవో చరిత్ర కనక తవ్వితే ఆ నెంబర్ కి మతి పోవడం ఖాయం. నగరాల్లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనూ అంతే. ఏడెనిమిది థియేటర్లతో నిత్యం కళకళలాడుతూ ఉండేవి. డిజాస్టర్లు సైతం కనీసం మూడు వారాలు ఆడే గొప్ప రోజులవి. బ్లాక్ బస్టర్ అయితే మినిమమ్ సిల్వర్ జూబ్లీ ఆడాల్సిందే. ఇదంతా గతం.

ఇప్పుడు మల్టీప్లెక్సుల డామినేషన్ పెరిగిపోయింది. జనాల ఆదాయంలో గణనీయమైన మార్పులు, భార్యా భర్తా ఇద్దరూ సంపాదించే కుటుంబాలు ఎక్కువ కావడంతో దానికి తగ్గట్టే సౌకర్యాలను డిమాండ్ చేయడం మొదలయ్యింది. ఫలితంగా కార్పొరేట్ సంస్థలు రంగప్రవేశం చేసి, ఒకే చోట నాలుగైదు స్క్రీన్లు ఉండే సముదాయాలు కట్టేసి, ఒకవేళ ఒక సినిమాకు టికెట్లు దొరక్కపోయినా వెనక్కు వెళ్లే అవసరం రానివ్వకుండా ఒక కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టాయి.

కాలక్రమేణా బుకింగ్ యాప్స్ రావడం, టెక్నాలజీ వాడకం లాంటివి జనాలకు టికెట్లు బుక్ చేసుకోవడం, సినిమాకు వెళ్ళడం మరింత సులభతరం చేశాయి. అంత గొప్ప సౌలభ్యాలు లేని సింగల్ స్క్రీన్లు క్రమంగా వైభవం తగ్గించుకున్నాయి. మెయింటెనెన్స్ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు. మైత్రి రవిశంకర్ అన్నట్టు శుభ్రమైన వాష్ రూమ్స్ , 4కె స్క్రీన్లు ఉన్న ఒంటి థియేటర్లు ఎన్ని ఉన్నాయంటే భాగ్యనగరం మొత్తం మీద సింగల్ నెంబర్లోనే ఉంటాయి.

సో ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది అనుభూతిని పై స్థాయికి తీసుకెళ్లడం గురించి. ఇవాళ మీటింగ్ లో చెప్పినట్టు బాలానగర్ విమల్, వైజాగ్ జగదాంబ – మెలోడీ – సంగం శరత్ తరహాలో అన్ని సింగల్ స్క్రీన్లు ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కనక పోటీ పడితే ఆడియన్స్ ఖచ్చితంగా వీటికే వస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిచ్ కావాలనుకునే వాళ్లు ఎలాగూ మల్టీప్లెక్సులకు వెళ్తారు. సో రెండూ మనుగడ కొనసాగిస్తాయి. ముందు ఆలోచన చేయాల్సింది ఈ కోణంలోనే.

This post was last modified on May 13, 2026 9:33 pm

Share

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

55 minutes ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

1 hour ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

2 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

3 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

13 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

14 hours ago