Movie News

దారి తప్పుతున్న కంటెంట్లు – ఎవరు బాధ్యులు

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన శ్రీరాములు లాంటి పెద్ద థియేటర్ వీక్ డేలో మూసేయాల్సి రావడం తదితర విషయాల మీద ప్రశ్నలు తప్ప సమాధానాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎంతసేపూ ఆడియన్స్ రావడం లేదనే మాటే కానీ ఎందుకు రావడం లేదనే అనాలిసిస్ సీరియస్ గా జరగడం లేదు. ఓటిటి, ఎండలు, ఐపీఎల్ అంటూ సాకులు స్టాకులో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.

ఇప్పుడే కాదు గతంలో భవిష్యత్తులో ఎపుడైనా సరే జనం థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. వాళ్లకు కావాల్సింది సరైన కంటెంట్. మరో డిస్కషన్ కు తావు లేదు. ఒకప్పడు రాఘవేంద్రరావు, దాసరి, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులు అన్నీ తామే చేయాలని తాపత్రయపడే వాళ్ళు కాదు. కథ ఒకరి దగ్గర కొనుక్కుని, మాటలు వేరొకరితో రాయించి, స్క్రీన్ ప్లే బాధ్యత ఇంకొకరికి అప్పగించి కేవలం దర్శకత్వం మాత్రమే తాము చేసేవాళ్ళు. అందుకే వందల సినిమాలు ఖాతాలో ఉన్నాయి.

కానీ ఇప్పటి యూత్ దర్శకుల ధోరణి అలా లేదు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నాలుగు శాఖలు మావే అంటారు. బ్యాలన్స్ తప్పుతున్న విషయాన్ని గమనించరు. పోనీ సలహాలు వింటారా అంటే అదీ లేదు. దీనికి తోడు నిర్మాతలు గుడ్డిగా వీళ్ళను నమ్మేసి రెమ్యునరేషన్లు ఇచ్చేసి అలో లక్ష్మణా అంటున్నారు. గత మూడు నెలల్లో విడుదలైన కొన్ని సినిమాలు బడ్జెట్ కేవలం అయిదారు కోట్లే. వాటిలో ఒక్కటి కూడా థియేటర్ బిజినెస్ రికవరీ సగం కూడా చేయలేకపోయాయి.

రోగం శరీరంలో ఉన్నప్పుడు దానికి మందు డాక్టర్ ని అడగాలి కానీ మానసిక వైద్యుడిని కలిస్తే ఏం లాభం. ఇండస్ట్రీ పోకడ అచ్చం ఇలాగే ఉంది. తాము రాసింది గొప్ప స్టోరీ, స్క్రీన్ ప్లే అని ఎవరికి వాళ్ళు ఫీలైపోయి అత్తెసరు కథా కథనాలతో ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులు ఇద్దరినీ విసుగెత్తిస్తున్నారు. జనాలు కేవలం విజువల్ గ్రాండియర్స్ మాత్రమే చూడటం లేదు. కల్కి, ఆర్ఆర్ఆర్ ఆడిన థియేటర్లలోనే లిటిల్ హార్ట్స్, కోర్ట్ లాంటివి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

అలాంటప్పుడు పొరపాటు ఎక్కడ జరుగుతోందో గుర్తించాలి కదా. అది వదిలేసి పబ్లిక్ రావడం లేదు మొర్రో అంటే లాభం లేదు. అసలే స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేయడమే అదృష్టంగా మారిపోయింది. థియేటర్లను కాపాడాల్సింది మిడ్ రేంజ్ చిత్రాలు, లో బడ్జెట్ మూవీస్ మాత్రమే. ఖర్చు ఎక్కువ పెట్టకపోయినా పర్లేదు కానీ క్వాలిటీ కంటెంట్ తో అద్భుతాలు చేయొచ్చు. మలయాళ సినిమాలే దానికి ఉదాహరణ. అలాంటివే మనం తీయనక్కర్లేదు కానీ మంచి కథలను గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది.

This post was last modified on May 13, 2026 1:11 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

23 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

53 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago