Political News

విజయ్ చెప్పింది ప్రాక్టికల్ గా సాధ్యమేనా?

రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో కొన్ని సీన్లు చూడ్డానికి భలే ఉంటాయి. ఒకే ఒక్కడు, భరత్ అనే నేను వంటి చిత్రాలలో ముఖ్యమంత్రి హోదాలో కథానాయకుడు తీసుకునే నిర్ణయాలకు థియేటర్లో విజిల్స్ మోత మోగిపోతాయి. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం సినిమాల్లో చూపించినంత ఈజీగా ముఖ్యమంత్రులు చేయడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అయితే, కథా నాయకుడి నుంచి మహా నాయకుడిగా ఎదిగిన టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం రీల్ లైఫ్ మాదిరిగా రియల్ లైఫ్ లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.

అంతేకాదు, తమ పార్టీ నేతలు గీత దాటితే వేటు తప్పదని విజయ్ కరాఖండిగా చెప్పేశారు. బడి, గుడికి 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం షాపులు తీసివేయాలని సంచలన ఆదేశాలు జారీ చేసిన విజయ్…తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలకూ కొన్ని నిబంధనలు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని హుకుం జారీ చేశారు. ప్రజలకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాల పేరుతో ఆర్భాటాలు చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే కార్యకర్తలపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే, పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోష్ లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మార్పు తీసుకురావాలని అనుకోవడం సహజం. అయితే, కాలక్రమంలో ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలు చేస్తారు, ఆ నేతలు ఏ మేరకు పాటిస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

This post was last modified on May 13, 2026 2:44 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

35 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago